Breaking News

పోలీసు శాఖలో ‘రెడ్‌బుక్‌’ రూల్‌

Published on Thu, 08/01/2024 - 05:19

సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖలో మంత్రి నారా లోకేశ్‌ ‘రెడ్‌బుక్‌’ రాజ్యమేలుతోంది. కూటమి ప్రభుత్వం పోలీసు అధికారుల బదిలీలను ‘రెడ్‌బుక్‌’ను అనుసరించి కక్షపూరిత వైఖరితోనే చేపడుతోంది. సీఐ నుంచి ఐపీఎస్‌ల వరకు అధికారులపై వేధింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే 24 మంది ఐపీఎస్‌ అధికారులకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన సందర్భం లేదు. ఇదే అత్యంత వివాదాస్పద రీతిలో డీఎస్పీలను బదిలీ చేసింది. 

బుధవారం భారీస్థాయిలో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఏకంగా 57 మంది డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం గమనార్హం. వీరందరినీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయమని ఆదేశించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష పూరిత ధోరణికి ఇది మరో నిదర్శనమని స్పష్టమవుతోంది. తుళ్లూరు డీఎస్పీ ఇ. అశోక్‌ కుమార్‌ గౌడ్, రాజంపేట డీఎస్పీ చైతన్యను మంగళవారం బదిలీ చేసి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయమని ప్రభుత్వం ఆదేశించింది.

 తుళ్లూరు డీఎస్పీ అశోక్‌ కుమార్‌ గౌడ్‌ బుధవారం రిటైర్‌ అయ్యారు. ఇలా రిటైర్మెంట్‌కు ఒక రోజు ముందు బదిలీ చేయడం, మరో చోట పోస్టింగ్‌ ఇవ్వకుండా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించడం నిబంధనలకు విరుద్ధం. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంపై డీఎస్పీ అశోక్‌ కుమార్‌ గౌడ్‌ డీజీపీ ద్వారాకా తిరుమలరావును కలిసి తన అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం. పోలీసు అధికారుల పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిపై పోలీసువర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)