Breaking News

హోం మంత్రి ఇలాకాలో.. అశ్లీల నృత్యాలు!

Published on Wed, 03/12/2025 - 04:49

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో అశీల్ల నృత్యా­లు అంబరాన్నంటాయి. టీటీడీ  ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రమైన ఉపమాక వెంకన్న కల్యాణ్సోతవం కార్యక్రమంలో వెగటు పుట్టించే పాటలతో అమ్మాయిల డ్యాన్స్‌­లతో అపచారానికి ఒడిగట్టారు. 

భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డీజే పేరుతో రికార్డింగ్‌ డ్యాన్సులను యథేచ్ఛగా నిర్వహించారు. సాక్షాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం జరుగుతుండడంతో.. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఈ రికార్డింగ్‌ డ్యాన్సులకు అడ్డు­చెప్పే ధైర్యం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

టీడీపీ పెత్తనంతో..  
నక్కపల్లి మండలం ఉపమాపకలో ఆరో శతాబ్ధానికి చెందిన వెంకన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది.  2017 సంవత్సరం వరకు దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే ఈ ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే టీటీడీకి అప్పగించింది. అప్పటి నుంచి  ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, కల్యాణోత్స­వాలు తిరుపతిలో మాదిరిగానే నిర్వహి­స్తున్నారు. 

ఈ ప్రత్యేక పర్వదినాల్లో కేవలం ఆధ్యా­త్మి­­కమైన సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఇప్పటి వరకు టీటీడీ అధికారులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత జరుగుతున్న ఈ ఉపమాక వెంకన్న కల్యాణోత్సవంలో టీడీపీ నేతల పెత్తనం పెచ్చుమీరింది.  హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తరువాత ఉపమాక దేవస్థానంలో తెలుగుదేశం నేతల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి. 

టీటీడీ సంప్రదాయానికి తూట్లు..  
వెంకన్న కల్యాణోత్సవ కార్యక్రమాన్ని అపవిత్రం చేసేలా టీడీపీ నేతలు రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి డీజే పేరుతో రికార్డింగ్‌ డ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు. ఒకవైపు స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకుని వెనుక ప్రాంతంలో డీజే స్టేజ్‌ ఏర్పాటు చేసి అమ్మాయిలు, అబ్బాయిలతో అశ్లీల నృత్యాలు  చేయించడం గమనార్హం.  

పైగా ఈ డ్యాన్స్‌ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవంతో పాటు రథోత్సవం అర్థరాత్రి 12 వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామి వారి కల్యాణం అర్థరాత్రి 2 గంటల తర్వాత హోం మంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. ఇటువంటి రికార్డింగ్‌ డ్యాన్సుల కార్యక్రమానికి టీటీడీ అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. 

కానీ ఈసారి మాత్రం కల్యాణోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కల్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు, ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు.  హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ప్రాచీన పుణ్య క్షేత్రంలో రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)