Breaking News

పోలవరానికి రూ. 2,700 కోట్లు అడ్వాన్స్‌!

Published on Mon, 02/24/2025 - 05:36

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాపాల ఫలితంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిపోయి, కేవలం 41.15 మీటర్లేనని మరోసారి తేలిపోయింది. ఈ ఎత్తుతో ప్రాజెక్టు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కేవలం ఓ బ్యారేజిగా మారిపోతుందని నిపుణులు చెబు­తున్నా, దానిని ప్రతిపాదిత ఎత్తు 45.72 మీటర్లకు పెంపునకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నా­లేమీ లేవు. దీంతో కేంద్రం కూడా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా నిధులిస్తోంది. 

ఆ ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం మరో రూ. 2,700 కోట్లు ఏపీ ప్రభుత్వానికి అడ్వాన్సుగా విడుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆర్థిక శాఖకు సిఫారసు చేశారు. దీంతో ప్రాజెక్టు ఎత్తు పెరగదన్న విషయం మరోసారి స్పష్టమైంది. కేంద్రం 2024–25 సవరించిన బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.5,512.50 కోట్లు కేటాయించింది. ఇందులో గతేడాది అక్టోబర్‌ 9న రూ.2,807.69 కోట్లు (రీయింబర్స్‌మెంట్‌ రూపంలో రూ.459.69 కోట్లు, అడ్వా­న్సుగా రూ.2,348 కోట్లు) విడుదల చేసింది. 

ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్‌ శక్తి శాఖ ద్వారా యూసీలు (వినియోగ ధ్రువీకరణ­పత్రా­లు) పంపితే మిగతా రూ.2,704.81 కోట్లు విడుదల చేస్తామని చెప్పింది. కేంద్రం రీయింబర్స్‌ చేసిన రూ.459.69 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం యూసీలు పంపింది. అడ్వా­న్సుకు యూసీలు పంపలేదు. ప్రస్తుత ఆర్థిక సంవ­త్సరం మరో 36 రోజుల్లో ముగియ­నున్న నేపథ్యంలో మిగతా నిధుల విడుదలకు జల్‌ శక్తి శాఖ సిఫారసు చేసింది. ప్రాజెక్టును 2026 మార్చికి పూర్తి చేయడానికి నిధుల సమస్య లేకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. 

ప్రాజెక్టును 41.15 మీట­ర్లకే పరిమితం చేస్తే 119.40 టీంఎసీలు మాత్రమే నిల్వ చేయొచ్చు. దీనివల్ల వరద ఉన్నప్పుడు కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకా­శం ఉంటుందని అధికారులు చెబుతు­న్నారు. అంటే.. మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఇక కృష్ణా డెల్టా స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గోదావరి జలాల సరఫరా కష్టమే అవుతుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)