Breaking News

అన్నదాత సేవలో ఆర్బీకే సైన్యం

Published on Fri, 12/08/2023 - 04:54

సాక్షి, అమరావతి: మిచాంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, అధిక గాలులకు దెబ్బతిన్న పంటలను కాపాడటంలో ఆర్బీకై సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. వర్షం తెరిపివ్వడంతో పంట­లను, పంట ఉత్పత్తులను కాపాడటంలో విశేష కృషి చేస్తూ రైతుల్లో ధైర్యాన్ని నింపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు  సహా­యక చర్యలను వ్యవసాయ శాఖ ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయి సిబ్బంది ఆర్బీకేల ద్వారా పూర్తి­స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ.. పొలాల్లోని వరి పనలు మొలకెత్తకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని రైతులతో కలిసి పనలపై సామూహికంగా చల్లుతున్నారు.

పొలాల్లో నిలిచిపోయిన నీటిను కిందకు పోయేలా చేస్తు­న్నారు. తడిసిపోయిన పనలను రైతు కూలీలతో కలిసి ఒడ్డుకు తీసుకొచ్చి ఉప్పు ద్రావణం చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో కాలువలు, డ్రెయిన్లను ఉపాధి హామీ కూలీల సహకారంతో మరమ్మతులు చేసి పంట పొలాల నుంచి వర్షపు నీటిని బయటకు పంపుతూ రైతులకు ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో నీరు నిలిచి ఉంటే.. చేలల్లో చిన్నపాటి బాటలు, బోదెలు తీసి మడుల నుంచి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఆర్బీకే సిబ్బంది స్వయంగా చేలలో నేలకు పడిపోయిన వరి దుబ్బులను లేపి.. కట్టలు కట్టే ప్రక్రియలో రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. పంట నష్టం అంచనాలకు ఎన్యుమ­రేషన్‌ బృందాలను ఏర్పాటు చేశామని, ముంపు నీరు పూర్తిగా చేల నుంచి తొలగిన తర్వాత పంట నష్టం అంచనా వేసేందుకు ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ కమిష­నర్‌ చేవూరు హరికిరణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)