Breaking News

రక్తం చిందుతున్నా వీరోచితంగా ప్రతిఘటన

Published on Tue, 11/03/2026 - 07:34

అనంతపురం ఎడ్యుకేషన్‌: అదో విద్యాలయం.. ఉదయం పది గంటల సమయం.. తరగతి గది అంతా నిశ్శబ్దం.. ఉపాధ్యాయిని పాఠం బోధిస్తోంది.. విద్యార్థులంతా చక్కగా వింటుంటే.. అంతలోనే నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఒక్కసారిగా అలజడి... అందరూ ఉలిక్కి పడి వెనక్కి చూశారు.. కరెంటు రంపంతో తలుపును కోస్తున్నట్లు కనిపించింది.. విషయాన్ని తేలికగా తీసుకున్న విద్యార్థులు.. యధావిధిగా పాఠంలో పడిపోయారు..

ఉన్నపళంగా ఒక్క ఉదుటన ఉన్మాది బాలికల వైపు  దూసుకొచ్చాడు.. ఓ విద్యార్థినిపై దాడికి తెగబడ్డాడు.. ఏమైందో..ఏం జరుగుతోందో.. తేరుకునేలోపే రక్తం ధారల్లా చిమ్ముతోంది.. గది అంతా హాహాకారాలు.. ఆర్తనాదాలు.. అంతలోనే సాహసలక్ష్మిగా వీరోచితంగా తిరగబడింది.. తోటి స్నేహితురాలిపై ఉన్మాది దాడిని ప్రతిఘటించింది.. అడ్డుకోయిన ఆమెపైనా దాడికి తెగబడ్డాడు.. రక్తపుమడుగులో నిస్సహాయంగా పడి ఉన్న బాలికను చూసి.. ఉన్మాది అక్కడి నుంచి ఉడాయించాడు.. ప్రశాంతంగా ఉన్న పాఠశాలలో జరిగిన ఈ ఘాతుకం.. దావానంలా వ్యాపించింది.. భయానికి తలవంచని బాలిక తెగువ.. మానవత్వం, ఆమె సాహసాన్ని ఎందరో ప్రశంసిస్తున్నారు. చదువుల తల్లి..భీతిల్లేలా జరిగిన భయానక ఘటన నేటికీ వెంటాడుతోంది.  

ఇద్దరిదీ విడదీయలేని స్నేహం 
రాప్తాడు మండలం అయ్యవారిపల్లికి చెందిన వెంకటరాముడు, నరసమ్మ దంపతుల కుమార్తె గోపిక, రాప్తాడు నాగరాజు, రమాదేవి దంపతుల కుమార్తె లక్ష్మి ఇద్దరూ ఆరోతరగతి నుంచి స్నేహంగా మెలుగుతున్నారు. పాఠశాలలోనూ పక్కపక్కనే కూర్చునేవారు. ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకునేవారు. ఇద్దరి మధ్య ఎంతో ఆత్మీయత ఉంది. అందుకే కళ్ల ముందే ప్రాణస్నేహితురాలిపై దాడి జరుగుతుంటే లక్ష్మీ తట్టుకోలేకపోయింది. 

ప్రాణభయంతో పరుగులు..  
ఉన్మాది తరగతి గదిలోకి ఎలక్ట్రిక్‌ రంపంతో చొరబడి తలుపును కట్‌ చేసిన అనంతరం నేరుగా గోపిక వద్దకు వెళ్లి ఆమె మెడపై దాడి చేశాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో తరగతి గదిలోని విద్యార్థులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయిని కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ, స్నేహితురాలు లక్ష్మి మాత్రం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్మాది దాడిని అడ్డుకుంది. స్నేహితురాలి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటంతో దుండగుడి దాడిని అడ్డుకునేందుకు వీరోచితంగా యత్నించింది. 

స్నేహితురాలిని కాపాడబోయి.. 
తన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన లక్ష్మిపై కూడా ఆగ్రహంతో ఉన్మాది రంపంతో దాడి చేశాడు. దీంతో ఆమె కూడా గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణభయంతో ఎవరూ సాహసం చేసి ముందుకు వెళ్లలేని ఘటన.. అయినా ఆ బాలిక వెనక్కి తగ్గకుండా తన స్నేహితురాలి ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురొడ్డి నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తనకేమవుతుందోనన్న ఆలోచన కంటే స్నేహితురాలి ప్రాణాలను కాపాడాలన్న తపనే ఆ సమయంలో లక్ష్మిలో కనిపించింది. 

ఇదీ చ‌ద‌వండి: రంపాలు మొలుస్తాయి

స్నేహానికి నిదర్శనం.. సమాజానికి స్ఫూర్తి 
సాధారణంగా ప్రమాదం ఎదురైనప్పుడు ప్రాణభయంతో మనుషులు తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటిది ఓ పాఠశాలలో కళ్ల ముందే స్నేహితురాలిపై రంపంతో దాడి జరుగుతుంటే అందరూ భయంతో పరుగులు తీసిన వేళ.. లక్ష్మీ మాత్రం తన ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకునేందుకు యత్నించింది. ఆమె చేసింది సాహసం మాత్రమే కాదు.. స్నేహానికి, ఆత్మీయతకు, తోటి బాలిక పట్ల బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం.  

జీజీహెచ్‌లో లక్ష్మీ శస్త్రచికిత్స విజయవంతం
అనంతపురం సిటీ: రాప్తాడులో ఉన్మాది హేమంత్‌ రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీకి అనంతపురం జీజీహెచ్‌ ఆర్థో విభాగం వైద్యులు సోమవారం శస్త్రచికిత్స చేశారు. రాప్తాడు పాఠశాల విద్యార్థిని గోపికపై హేమంత్‌ దాడి చేస్తున్న సమయంలో లక్ష్మీ ధైర్యంగా ఎదుర్కొన్న విషయం విదితమే. హేమంత్‌ దాడిని అడ్డుకునే క్రమంలో ఎలక్ట్రిక్‌ రంపం తగిలి లక్ష్మీ కాళ్లకు లోతైన గాయాలయ్యాయి. 

ఘటన అనంతరం జీజీహెచ్‌లో అడ్మిషన్‌లో ఉన్న లక్ష్మీకి సోమవారం ఉదయం ఆర్థో విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బీఎండీ గౌస్‌ నేతృత్వంలో అనస్థీషియా డాక్టర్‌ మధుసూదన్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నాగరాజు నాయక్, డాక్టర్‌ సౌజన్య, ఆర్థో, అనస్థీషియా విభాగం పీజీలు, ఓటీ సిబ్బంది దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. బాలిక పాదంలో తెగిన నరాలు, బొటనవేలి సమీపంలో జాయింట్‌ను శస్త్రచికిత్సలో సరిచేశారు. ఆర్థో విభాగం వైద్యులను జీజీహెచ్‌ ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.    

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)