Breaking News

కరకట్ట నివాసం ఎవరిది బాబూ?

Published on Tue, 05/16/2023 - 04:34

(సాక్షి, అమరావతి) : ఇంతకీ కరకట్ట నివాసం ఎవరిది? చంద్రబాబుదా... లేక ప్రభుత్వానిదా? ‘‘ఆ ఇంటికి సంబంధించి అవినీతికి తావెక్కడుంది? ఎందుకంటే ఆ ఇల్లు ప్రభుత్వానిది. లింగమనేని రమేశ్‌ నుంచి ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే భూసేకరణ ద్వారా తీసుకుని ఉండేవాళ్లం’’ అని నేరుగా చంద్రబాబే.. సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పారు. ఇక లింగమనేని కూడా... ఆ ఇల్లు పూలింగ్‌లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని, అక్కడ భారీ భవంతులు కడితే తనకెంతో సంతోషమని కూడా చెప్పారు. వీళ్ల మాటలకు వీడియో సాక్ష్యాలూ ఉన్నాయి.  

ఇక్కడ అసలు ప్రశ్నేమిటంటే... : ఆ ఇల్లు ప్రభుత్వానిది అయినపుడు ప్రభుత్వ రికార్డుల్లో ఆ సంగతి ఉండాలి కదా? ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక కూడా చంద్రబాబు అందులో ఉంటున్నారంటే... అందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి కదా? అసలు ఆ ఇల్లు ప్రభుత్వానిదన్న సంగతి ప్రభుత్వ రికార్డుల్లోనే లేదంటే ఏమనుకోవాలి? వీళ్లంతా కలిసి ఎంతటి దొంగల రాజ్యాన్ని నడిపించారో తెలియటం లేదా? ప్రభుత్వాస్తుల్ని కూడా ప్రయివేటు ఆస్తుల్లా ఎలా మార్చేసుకున్నారో తెలియటం లేదా? 

చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం అది ప్రభుత్వ ఆస్తే అయినపుడు... : ప్రభుత్వం ఇపుడు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కుంభకోణంలో భాగంగా ఆ ఇంటిని జప్తు చేస్తుంటే ఉలుకెందుకు? అదేదో చంద్రబాబు సొంత ఆస్తిలా ఫీలవుతూ... ‘ఈనాడు’ దుర్మార్గపు రాతలెందుకు? బాబును టార్గెట్‌ చేస్తున్నారంటూ రామోజీ శోకాలెందుకు? ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనంటూ తెలుగుదేశం డ్రామాలెందుకు? ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తుంటే వీళ్లంతా ఎందుకింత దుష్ప్రచారానికి తెగిస్తున్నారు? ఇంకెన్నాళ్లు బాబూ ఈ డ్రామాలు? 

నాడు అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిందిదీ.. : ప్రజా వేదిక నాది కాదు. ప్రభుత్వానిది. నేనుంటున్న భవనం నాది కాదు. రమేష్‌ అనే డెవలపర్‌ది. నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేనొక టెనెంటే (అద్దెకుంటున్న వాడిని).

ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చెప్పిందిదీ..: గ్యాస్‌ ఇచ్చామని ప్రతిఫలంగా ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వడమేంటి? అది గమర్నమెంట్‌ ఇల్లు. నేనున్నానంటే..అది గవర్నమెంట్‌ ఇల్లు కాబట్టి ఉన్నాను. నేను మొదటి రోజే చెప్పాను. దిస్‌ ప్రొపర్టీ బిలాంగ్స్‌ టు గవర్నమెంట్‌. నువ్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటాం. ఇస్తే ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకుంటాం. ఇవ్వకపోతే  లాండ్‌ అక్విజిషన్‌లో తీసుకంటాం. టెంపరరీగా నేను ఉండాలి. కార్యక్రమాలు స్టార్ట్‌ చేయాలి కాబట్టి నేను అక్కడ ఉంటున్నా. కట్టకు ఆవతల ఉండే ల్యాండ్‌ అంతా, కట్టడాలన్నీ పోయి టూరిజం, మిగతావన్నీ వస్తాయి. మాస్టర్‌ ప్లాన్‌లో కూడా నోటిఫై చేశారు.

లింగమనేని రమేష్‌ విలేకరులతో చెప్పిందిదీ.. :  ప్రభుత్వం ఆ భవనాన్ని పూలింగ్‌లో తీసుకుంది. దేశంపై భక్తితో ఇచ్చేశాను. నాకు ఆ భవనంతో ఏ రకమైన సంబంధం లేదు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)