Breaking News

ముస్లింలపై ‘ఈనాడు’ ద్వంద్వ నీతి!.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

Published on Tue, 04/11/2023 - 08:36

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ముస్లిం సమాజంపై వివక్ష చూపి వారిని తీవ్ర వేధింపులకు గురిచేసినా ఒక్క అక్షరం ముక్క రాయని ఈనాడు పత్రిక ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారిని సగౌరవంగా నిలబెట్టినా అన్యాయం చేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివారం అమరావతిలోని ఒక ముస్లిం కాలనీకి వెళ్లి ముస్లిం యువకులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారు.

ఈ క్రమంలో ఏర్పడిన ఉద్రిక్తతలను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే దాన్ని ముస్లిం యువకులపై దాడిగా ఈనాడు చిత్రీకరించి చిలవలు పలవలుగా కథనం రాసింది. ఒక యువకుణ్ణి పోలీసులు కొడుతున్నట్లు ఫొటో ఒకటి ప్రచురించి వైఎస్సార్‌సీపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు చూపించడానికి తాపత్రయపడింది. 

దేశద్రోహం కేసుపై ఎందుకు రాయలేదు?
ఈ చిన్న ఘటనను భూతద్దంలో చూపించిన ఈనాడు.. చంద్రబాబు హయాంలో ముస్లింలపై అడుగడుగునా దారుణాలు జరిగినా ఏనాడూ రాయలేదు. 2018లో చంద్రబాబు సీఎంగా ఉండగా గుంటూరులో నారా హమారా పేరుతో నిర్వహించిన సభలో కొందరు యువకులు తమకిచ్చిన హామీలు అమలుచేయాలని ప్లకార్డులు చూపించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి వారిపై రాజద్రోహం కేసుపెట్టి చిత్రహింసలు గురిచేసినప్పుడు ఈనాడులో కనీసం వారి గురించి రాయలేదు.

కేవలం చంద్రబాబును ప్రశ్నించారనే కారణంతో 9 మంది యువకులపై ఉగ్రవాదులనే ముద్రవేసి నెలలపాటు వారిని చిత్రహింసలకు గురిచేశారు. సామాన్య ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు ఏమిటని ముస్లిం సమాజం యావత్తూ ఆందోళన చేసినా ఈనాడు స్పందించలేదు. గుంటూరులో పలు సాకులు చూపి ముస్లిం పిల్లలు 200 మందిపై కేసులు పెట్టినా,  వేధించినా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు తెలుగుదేశం ప్రయోజనాల కోసం ఏమీ జరగకపోయినా ముస్లిం యువకులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ  ఇష్టారాజ్యంగా రాతలు రాయడంపై ఆ వర్గంలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చదవండి: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం

వారికి మంత్రి పదవి ఇవ్వకపోయినా పట్టించుకోలేదు
నిజానికి.. చంద్రబాబు ముస్లింలను అన్ని రకాలుగా అవమానించడంతోపాటు తీవ్రంగా అణచివేశారు. టీడీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో కనీసం ఆ వర్గానికి చంద్రబాబు తన కేబినెట్‌లో నాలుగేళ్లపాటు చోటు కల్పించలేదు. నంద్యాల ఉప ఎన్నిక రావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు చివరి ఆర్నెలల్లో ఎన్‌ఎండీ ఫరూక్‌ను మంత్రిని చేశారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది.ముస్లిం సమాజమంతా ముక్తకంఠంతో చంద్రబాబు తీరును వ్యతిరేకించినా ఈనాడుకు పట్టలేదు. ఇప్పుడుమాత్రం చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకు వారిపై ప్రేమ ఒలకబోసేలా వార్తలు రాయడంపై ముస్లింలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)