Breaking News

మంత్రికి, ఆయన తండ్రికి రుణపడి ఉంటా

Published on Sat, 11/23/2024 - 09:40

రామచంద్రపురం:  స్థానిక సీఐ కడియాల అశోక్‌కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం పట్టణంలోని టౌను హాలులో గురువారం జరిగిన శెట్టిబలిజ సామాజికవర్గ వనసమారాధనకు ఆయన పోలీసు యూనిఫాంతో వెళ్లడమే కాకుండా.. ‘‘నేను ఇక్కడకు (రామచంద్రపురం సీఐగా) రావడానికి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు, ఆయన తండ్రి సత్యానికి నేను, నా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని బహిరంగంగా చెప్పారు. 

అంతేకాకుండా ‘‘భవిష్యత్‌ అంతా మనదే. ఎందుకంటే పోలీసు శాఖతో పాటుగా ఇతర శాఖల్లోనూ మనవారున్నారు’’ అని అన్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై నియోజకవర్గానికి చెందిన కొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సీఐ అశోక్‌ను వీఆర్‌కు పంపిస్తూ చర్య తీసుకున్నారు. కోనసీమ జిల్లాలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఈ విషయమై కలెక్టర్‌కు నివేదిక కూడా సమరి్పంచారు. 

ఆది నుంచీ వివాదాస్పదమే.. 
సీఐ అశోక్‌ కుమార్‌ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గత ఆగస్ట్‌ 7న ఆయన రామచంద్రపురం సీఐగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ అధికార పార్టీకి చెందిన వారిలో ఒక వర్గానికి పూర్తిగా కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో జగనన్న కాలనీల్లో టీడీపీకి చెందిన కొంత మంది ఇసుకను బహిరంగంగానే దొంగిలించుకుపోగా, వారి పక్షాన ఉంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

అనంతరం రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామంలో జరిగిన ఒక సివిల్‌ వివాదంలో తలదూర్చి, టీడీపీ వారికి వత్తాసు పలికి, సివిల్‌ కేసును మరింత వివాదంగా మార్చారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా ప్రతి విషయంలోనూ టీడీపీకి చెందిన ఒక రౌడీషిటర్‌కు మంత్రి సహాయ సహకారాలతో కొమ్ముకాస్తూ, ఆయన చేసిన ఘనకార్యాలకు వత్తాసు పలికారంటూ నియోజకవర్గ వాసులతో పాటు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కొంత మంది కూడా వ్యతిరేకించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 

గతంలో రామచంద్రపురం ఎస్సైగా సీఐ అశోక్‌ కుమార్‌ బంధువైన పాటి వాసు బాధ్యతలు స్వీకరించారు. తరువాత రామచంద్రపురం సీఐగా అశోక్‌ ఇక్కడకు వచ్చారు. అనంతరం వారం రోజుల్లోనే ఎస్సై వాసు కూడా వీఆర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ సందర్భంలో స్థానికంగా ఉన్న రా్ర‹Ù్టర మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తిరిగి వాసును ఉంచే ప్రయత్నం చేయలేదంటూ అదే పారీ్టకి చెందిన వారు అలక వహించినట్లు అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తాజాగా సీఐ అశోక్‌ను కూడా వీఆర్‌ నుంచి తప్పించడంలో మంత్రి చేతులెత్తేశారని సమాచారం. ఏరి కోరి తెచ్చుకున్న సీఐ ఇలా వివాదాల్లో ఇరుక్కోవడం మంత్రికి తలనొప్పిగా మారినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.  

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)