జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?
Breaking News
ముగిసిన రాంగోపాల్ వర్మ విచారణ
Published on Fri, 02/07/2025 - 13:01
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు రూరల్ పోలీస్స్టేషన్కు రాంగోపాల్ వర్మ వచ్చారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో చంద్రబాబు, పవన్పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ.. ఇవాళ విచారణకు హాజరయ్యారు.
ముగుసిన అర్జీవి విచారణ
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు రాం గోపాల్ వర్మ ను విచారించారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు.మద్దిపాడు పీఎస్ 0 గంటల పాటు అర్జీవి విచారించారు. విచారణ ముగిసిన అనంతరం రాం గోపాల్ వర్మ హైదరాబాద్కు బయల్దేరారు.

Tags : 1