లిక్కర్‌ కేసు.. ఆ రూ. 11 కోట్లను ఇతర నోట్లతో కలపొద్దు: ఏసీబీ కోర్టు

Published on Sat, 08/02/2025 - 11:12

లిక్కర్‌ కేసు.. సిట్‌ కుట్ర.. కేసిరెడ్డి పిటిషన్‌ అప్‌డేట్స్‌.. 

విజయవాడ

  • అక్రమ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
  • వీడియోగ్రఫీ చేయకుండానే నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ కెసిరెడ్డి మెమో
  • కెసిరెడ్డి మెమో పై కోర్టు కీలక ఆదేశాలు
  • రూ.11 కోట్లను ఇతర డబ్బుతో కలపొద్దని ఏసిబి కోర్టు ఆదేశాలు
  • రూ.11 కోట్లను విడిగా ఉంచాలని సిట్ , మాచవరం ఎస్.బిఐ బ్యాంకుకు ఆదేశం
  • డిపాజిట్ చేసే ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలని ఆదేశం
  • డీటెయిల్డ్ పంచనామా కోర్టుకు సమర్పించాలని సిట్ కు ఆదేశం

👉ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. రూ.11 కోట్ల సీరియల్‌ నెంబర్‌ వీడియోగ్రఫీ చేయాలని పిటిషన్‌లో కోరారు. రూ.11 కోట్లను ఎస్‌బీఐలో డిపాజిట్‌ చేసేందుకు సిట్‌ సన్నాహాలు చేస్తోందన్నారు. 11 కోట్లను ఖచ్చితంగా కోర్టు కమిషనర్‌ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేయాలని లాయర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. సిట్‌ తొందరపాటు చర్యలకు పాల్పడుతోందని న్యాయవాది తెలిపారు. 

👉ఏపీ మద్యం అక్రమ కేసులో సిట్‌ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ కేసులో సీజ్‌ చేసిన నోట్ల కట్టలను సిట్‌ తారుమారు చేస్తోందంటూ రాజ్‌ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో డిపాజిట్‌ చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలను సిట్‌ బృందం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్‌ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.

👉అక్రమ మద్యం కేసులో కేసిరెడ్డి తరఫు లాయర్లు తాజాగా మాట్లాడుతూ.. మద్యం అక్రమ కేసులో సీజ్‌ చేసిన నోట్ల కట్టలను సిట్‌ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కోర్టు అనుమతి లేకుండానే డబ్బులను బ్యాంకులో డిపాజిట్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్దంగా రూ.11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు సిట్‌ బృందం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్‌ నెంబర్లను వెరిఫై చేస్తే సిట్‌ తప్పు దొరికిపోతుంది. తమ తప్పు దొరికిపోతుందనే భయంతోనే వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారు.

👉నోట్ల కట్టల బ్యాచ్‌ నెంబర్లను వీడియోగ్రఫీ చేయాలంటూ నిన్న సిట్‌కు జడ్జి చెప్పారు కదా. ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్‌కు ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ డిపాజిట్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్‌ కుట్రలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు చెప్పుకొచ్చారు.  

నాకు సంబంధమే లేదు: కేసిరెడ్డి
👉ఇక, అంతకుముందు.. అక్రమ మద్యం కేసు­లో ‘సిట్‌’ అధికారులు హైదరాబాద్‌లో సీజ్‌ చేసిన రూ.11 కోట్ల నగదుతో తనకెలాంటి సంబంధంలేదని రాజ్‌ కేసిరెడ్డి న్యాయ­మూర్తి ఎదుట స్పష్టంచేశారు. తనకు సంబంధం లేకున్నా సిట్‌ సీజ్‌ చేసిన ఆ డబ్బు తనదేనని ‘సిట్‌’ లింకులు పెడుతోందన్నా­రు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనని అంటున్నారన్నారు. 2014­లోనే తాను ఆ డబ్బును వరుణ్‌కు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్‌ అయ్యాయో తెలుస్తాయని అన్నా­రు. ఆ నగదు తన స్వహస్తాలతోనే ఇచ్చానని చెబుతున్నారని, వాటిపై తన వేలిముద్రలు ఉన్నా­యో లేదో చెక్‌ చేయాలని న్యాయమూర్తిని కోరారు. 

👉తన వయసు 43 ఏళ్లని, 45 ఏళ్ల కిందటి ఫామ్‌హౌస్‌కు తాను బినామీ అని చెబుతున్నారని, తాను పుట్టకముందే బినామీ ఆస్తులుంటాయా? అని ప్రశ్నించారు. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్లు ‘సిట్‌’ చెబుతోందన్నారు. తనను అక్ర­మ­ంగా కేసు­లో ఇరికించారని, తన బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్‌ అబద్ధాలు చెబుతోందంటూ న్యాయ­మూర్తి ఎదుట రాజ్‌ కేసిరెడ్డి కంటతడిపెట్టారు. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు కీలక ఆదేశాలిచ్చారు. సీజ్‌ చేసిన రూ.11 కోట్లను ఫొటోలు తీయాలని ‘సిట్‌’ను ఆదేశించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)