Breaking News

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు

Published on Sun, 10/20/2024 - 05:17

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఉపరితల ఆవ­ర్త­నా­లు, అల్పపీడనాల ప్రభావంతో ఆదివారం నుంచి 5 రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవ­నున్నాయి. ప్రస్తుతం అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి 23వ తేదీ నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్‌ లేదా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో తీరం దాటే సూచనలు సమానంగా ఉన్నాయనీ.. 21 తర్వాత ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ హెడ్‌ భారతి ఎస్‌ సబడే తెలిపారు. ఎక్కువగా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో ఈ నెల 24 నుంచి 26 మధ్యలో తీరం దాటేందుకు అవకాశా­లున్నాయని అంచనా వేస్తున్నట్టు అమరావతి వాతా­వరణ కేంద్రం అధికారి స్టెల్లా పేర్కొన్నారు. 

కాగా.. వారం క్రితం మన రాష్ట్రంలో బలహీనపడిన వాయుగుండం ప్రస్తుతం అరేబి­యా సముద్రం–దక్షిణ కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో అల్పపీడనంగా ఉంది. వీటన్నింటి ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రధానంగా రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఒడిశా వైపు కదిలే అవకాశం ఉండటంతో 23వ తేదీ తర్వాత ఉత్తరాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

మరోవైపు ఈ నెల 29న ఒకటి, వచ్చే నెల 3న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అల్ప­పీడనం ఏర్పడే సూచనలు మొదలైన నేపథ్యంలో సముద్రంలో అలజడి మొదలైందనీ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులెవరూ ఆదివారం నుంచి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Videos

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)