Breaking News

ఉపరితల ద్రోణి ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

Published on Sat, 02/22/2025 - 07:11

సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రితం తెలంగాణ, ఒడిశా మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు తూర్పు ప్రాంతంలో ఉపరి­తల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల, తెలంగాణలో అక్కడకక్కడా తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని, పలుచోట్ల ఆకాశం మేఘా­­వృతమై ఉంటుందని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు.

ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం చల్లబడే సూచ­­నలు మాత్రం కనిపించడం లేదని, గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని స్పష్టం చేశా­రు. రానున్న మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవ­కా­శం ఉందని అధికారులు తెలిపారు.

తెలంగాణకు వర్ష సూచన..
తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. రాబోయే మూడు రోజులు ఉదయం వేళ కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది.

మరోవైపు ఏపీ, తెలంగాణలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాచోట్ల ఇప్పటికే 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. వేసవి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రతగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)