ఏపీలో నాలుగు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు

Published on Wed, 07/23/2025 - 14:19

సాక్షి,విశాఖ:  ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని బుధవారం వాతావారణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మత్స్యకారులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  

పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్‌,ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.  

అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్‌ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావారి, పశ్చిమ గోదావారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు..ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.  

ఉత్తరాంధ్ర తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని,భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఇంకా తీవ్ర వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తత అవసరం ఉందని సూచించారు.

ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)