Breaking News

అర్ధరాత్రి వచ్చి పొమ్మంటే ఎలా..?

Published on Tue, 04/08/2025 - 09:51

టెక్కలి: రోడ్డు విస్తరణ పేరుతో అర్ధరాత్రి వచ్చి తెల్లవారింటికి ఇళ్లు ఖాళీ చేయాలని చెబితే ఎక్కడికి పోతాం అంటూ.. అంబ్కేడర్‌ జంక్షన్‌ సమీపంలో ని వాసం ఉంటున్న వారంతా సోమవారం రాత్రి తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులను నిలదీశారు. అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి చెట్లతాండ్ర మార్గంలో రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టిన క్రమంలో ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన పనులు చేపట్టారు. 

అయితే సోమవారం రాత్రి పంచాయతీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి ఉదయాన్నే ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో, అక్కడ నివసిస్తున్న వారంతా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ఇన్‌చార్జి తహసీల్దార్‌ రవికుమార్‌ వద్ద సమస్యలు ఏకరువు పెట్టారు. అయితే ముందుగా దుకాణాలు తొలగిస్తామని, ఆ తర్వాత ఇళ్లు ఖాళీ చేయిస్తామని ఆయన సర్దిచెప్పారు. 

ఇల్లు కోల్పోయిన వారందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి చెప్పారని ఇప్పుడు ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చెయ్యమంటే, పిల్లలతో ఎక్కడకు వెళ్లాలని వారంతా నిలదీశారు. గతంలో ఇంటి స్థలం మంజూరు కాకపోయిన వారందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని తహసీల్దార్‌ చెప్పడంతో అంతా వెనుదిరిగారు. ముందుగా ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత విస్తరణ పను లు చేయాలి తప్ప ఇలా అర్ధరాత్రిళ్లు వచ్చి తెల్లవారింటికి ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడం సమంజసం కాదంటూ బాధితులు మండిపడ్డారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)