Breaking News

బాధ్యత మరచి.. బాధితురాలి పేరు చెప్పి

Published on Fri, 06/13/2025 - 04:10

అనంతపురం టవర్‌క్లాక్‌: బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ కనీస అవగాహన లేకుండా అత్యాచార బాధితురాలి పేరు చెప్పడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 14 మంది టీడీపీ కీచకులు దళిత బాలికపై అత్యాచారం చేయగా.. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దళిత బాలికను పరామర్శించేందుకు గురువారం అనంతపురం వచ్చిన రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు. 

ఈ క్రమంలో అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును శైలజ పదేపదే ప్రస్తావించారు. దీంతో ఆమె తీరును జర్నలిస్టులు తప్పుపట్టారు. అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పకూడదంటూ నిబంధన ఉందని ఆమెకు గుర్తు చేశారు. గతంలో అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పారంటూ మాజీ ఎంపీ మాధవ్‌పై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌పైన కూడా కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. 

అలాగే ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఆమెను అడ్డుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లాలో గిరిజన విద్యార్థిని తన్మయి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడ్డారు. దళిత బాలికపై సామూహిక అత్యాచారం విషయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహ­రించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే.. ఉద్యమిస్తామని హెచ్చరించారు.

భయపడడం వల్లే హత్యలు, అత్యాచారాలు..
మహిళలు, బాలికలు భయపడటం వల్లే హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలనిని సూచించారు. ఏ కష్టం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గిరిజన విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు. అయినా పోలీసులపై ఆరోపణలు రావడంతో సీఐను సస్పెండ్‌ చేశామన్నారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేస్తామన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)