Breaking News

శ్రీచంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్‌

Published on Fri, 04/21/2023 - 11:11

సాక్షి, తిరుపతి: పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ సూళూరుపేట శ్రీచంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ప్రయోగానికి ముందు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. రాకెట్‌ నమూనాతో సోమనాథ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, శనివారం మధ్యాహ్నం 2.20 లకు పీఎస్‌ఎల్‌వీ సీ–55 నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకి కౌంట్‌ డౌన్‌ ప్రారంభం కానుంది. పూర్తి 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్‌ కొనసాగనుంది.

పూర్తిగా విదేశీ పరిజ్ఞానం, సింగపూర్‌కి చెందిన వాణిజ్య ప్రయోగం ఇది. ఈ రాకెట్‌ ద్వారా 741 కిలో బరువు కలిగిన లియోన్‌-2 తో పాటు 16 కిలోల లూమ్‌ లైట్‌-4 శాటిలైట్లను రోదసిలోకి ఇస్రో పంపనుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో తిరుపతిజిల్లా శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి చేరుకున్నారు విదేశీ శాస్త్రవేత్తల బృందం. అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూ, ఉపరితలం, సముద్ర తీరంలోనూ సీఐఎస్‌ఎఫ్‌ బలగాల విస్తృత తనిఖీలు చేపట్టారు. షార్‌ పరిసర ప్రాంతాల్లో ఇతరులకు ప్రవేశాన్ని నిషేధించారు.
చదవండి: చింతమనేని ప్రభాకర్‌ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)