Breaking News

అంబేడ్కర్‌ జోలికి వస్తే సహించం: వైఎస్సార్‌సీపీ శ్రేణులు

Published on Sun, 08/11/2024 - 05:26

సాక్షి, నెట్‌వర్క్‌: విజయవాడ నగరం నడిబొడ్డున అంబేడ్కర్‌ స్మృతివనంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని రాష్ట్రవ్యా­ప్తంగా ప్రజలు నిరసించారు. వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు శనివా­రం రాత్రి కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం జోలికి వస్తే సహించబోమని నినదించారు. 

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కొవ్వొత్తులతో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. అంబేడ్కర్‌ విగ్రహానికి పూల­మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ కార్య­క్రమంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు పాల్గొన్నారు.

»  గుంటూరు నగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. యర్రగొండపాలెంలో జరిగిన నిరసనలో జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.

»  అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు రాస్తారోకో చేసి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేత ఈర లక్కప్ప ఆధ్వర్యంలో, హిందూపురంలో పార్టీ నేత దీపిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కర్నూలులో మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ తదితరుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. కల్లూరులో జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

»    విశాఖ నగరంలో వైఎస్సార్‌సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో, అనకాపల్లిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో, అడ్డరోడ్డు కూడలిలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. 

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఇచ్ఛాపురంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, రణస్థలంలో పార్టీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, పాతపట్నంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కొవొత్తుల ప్రదర్శనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు.



»   చిత్తూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు గాయత్రీదేవి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో కడపలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా, కడప మేయర్‌ కె. సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. కమలాపురంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, నవ్యాంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌బాబు ఆధ్వర్యంలో, అన్నమయ్య జిల్లా రాజంపేటలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ దండుగోపి తదితరుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)