రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ కేసు.. ఒంటిపై గాయాలు!

Published on Wed, 02/18/2026 - 07:47

కూసుమంచి: ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచగా, పురోగతి సాధించినట్లు తెలిసింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఈనెల 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లో మునగగా మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఘటన జరిగాక కారు నడుపుతున్న వ్యక్తి ఒడ్డుకు చేరి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో కూసుమంచి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

సదరు వ్యక్తి హైదరాబాద్‌లో పోలీసులకు లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని, అదే జరిగితే కేసులో చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు కారు యజమానిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక శ్రీనివాస్‌ మృతదేహానికి నేలకొండపల్లి ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన నివేదిక వచ్చినట్లు సమాచారం. శ్రీనివాస్‌ నీట మునగడంతో చనిపోలేదని, ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు ధ్రువీకరించారని తెలిసింది.

ఏదేమైనా మిస్టరీగా మారిన శ్రీనివాస్‌ మృతి కేసు మరో రెండు రోజుల్లో ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. మృతుడు శ్రీనివాస్‌ సెల్‌టవర్ల వ్యాపారంలో ఉండగా, ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోగా.. త్వరలోనే కేసు ఛేదిస్తామని కూసుమంచి ఎస్సై నాగరాజు ‘సాక్షి’కి తెలిపారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)