Breaking News

కర్ణాటకలో పింఛన్‌ కష్టం..

Published on Mon, 01/15/2024 - 08:29

శివాజీనగర: పింఛన్‌ కోసం కర్ణాటక రాష్ట్రంలో 77 ఏళ్ల ఓ దివ్యాంగ వృద్ధురాలు రెండు కిలోమీటర్లకు పైగా పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చిన ఘటన అం­దర్నీ నివ్వెరపరిచింది. పంటిబిగువన నరకయాతన అనుభవిస్తూ పోస్టాఫీసుకు వచ్చిన ఆమెకు తీవ్ర నిరాశే మిగిలింది. అవ్వాతాతలకు పింఛన్ల పం­పి­­ణీ అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు, ఇతర రాష్ట్రాలకు ఉన్న తేడాకు ఈ ఘటన నిదర్శనంగా ని­లుస్తోంది. ఏపీలో ఒకటో తేదీ వచ్చిందంటే.. వలంటీర్లు తెల్లారకముందే తలుపుకొట్టి అవ్వాతాతల చేతుల్లో పింఛను సొమ్ము పెడుతుండడం తెలిసిందే.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్ణాటకలో అమలవుతున్న తీరుతో కన్నడిగులు పోలుస్తున్నారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా కుణిబెళకెర గ్రామానికి చెందిన వయో వృద్ధురాలు గిరిజమ్మకు ఎవరూలేరు. ప్రభుత్వం ఇచ్చే పెన్షనే ఆమెకు జీవనాధారం. ప్రతి నెలారంభంలో హరి­హర పోస్టాఫీసులో పెన్షన్‌ తీసుకుంటుంది. గత ఏడాది నవంబరు నుంచి సక్రమంగా అందడంలేదు. ఆటోలో రావడానికి డబ్బులు లేకపోవడంతో వారం రోజుల కిందట గ్రామం నుంచి రెండు కిలో మీటర్లు పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చింది.

కానీ, పెన్షన్‌ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పడంతో హతాశురాలైంది. ఆమె కష్టాన్ని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌ అయ్యింది. అంతదూరం నుంచి పాక్కుంటూ రావడంవల్ల ఒళ్లు చీరుకుపోయి బొబ్బలు వచ్చినా లెక్కచేయలేదు. ‘ఆ పెన్షన్‌ వస్తేనే నాకు రోజు గడుస్తుంది. అదే లేకపోతే ఏం తినాలి, అందుకే కష్టమైనా పాకుతూనే వచ్చాను..’ అని గిరిజమ్మ దీనంగా చెప్పింది.

 కాగా, ఈ విషయమై పెద్దఎత్తున విమర్శలు రావడంతో స్థానిక సబ్‌ కలెక్టర్‌ అమూల్య పాండా స్పందిస్తూ.. ఇంటికే వెళ్లి పెన్షన్‌ అందజేసే సదుపాయం రాష్ట్రంలో లేదనడం గమనార్హం. ఏపీలో వైఎస్‌ జగన్‌ సర్కారు ప్రతి నెలా మొదటి తారీఖునే ఇళ్లకే వెళ్లి మరీ అవ్వాతాతలకు రూ.3వేలు చొప్పున ఫించన్‌ సొమ్ము అందజేస్తుండడం తెలిసిందే. దేశంలో రూ.3 వేల ఫించన్‌ తోపాటు ఎక్కువ మందికి ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే కావడం విశేషం. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)