Breaking News

ప్రభుత్వ ధనం.. ప్రైవేటు లాభం!

Published on Thu, 10/30/2025 - 05:50

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చెల్లించినట్లు భారీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని, ఇలాంటి కేసుల్లో ప్రజా ప్రయోజనాలనే కోర్టులు పరమావధిగా పరిగణించాలని సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. 

రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను పబ్లిక్, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్‌ కుర్రా వసుంధర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం ముందు తాజాగా ఈ పిల్‌ విచారణకు వచ్చింది. 

పిటిషనర్‌ తరఫున శ్రీరామ్‌ తన వాదనలను వినిపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను లీజుకివ్వడం వల్ల ప్రైవేటు వ్యక్తులు రూ. కోట్లు ఆర్జిస్తారన్నారు. కాలేజీలను కేంద్రం, నాబార్డ్‌ ఇచ్చే నిధులతోనే నిర్మిస్తారని తెలిపారు. లబ్ధి మాత్రం ప్రైవేటు వ్యక్తులే పొందుతారన్నారు. ప్రభుత్వ వైద్య సేవలకు  పేదలు  దూరమవుతారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 19కి వాయిదా వేసింది.   

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)