Breaking News

ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

Published on Sun, 01/25/2026 - 05:05

కొనకనమిట్ల: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల–చినారికట్ల మధ్య శుక్రవా­రం అర్ధరాత్రి ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని, ఆ వెంటనే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... శుక్రవారం రాత్రి కనిగిరి నుంచి వెదురుకర్రల లోడుతో గిద్దలూరుకు వెళ్తున్న బొలేరో వాహనం చినారికట్ల సమీపంలో మరమ్మతులకు గురైంది. 

డ్రైవర్‌ పీరయ్య బొలేరోను రోడ్డు పక్కన నిలిపి వాహనం లోపల నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వాసవి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్‌ను కూడా ఢీకొంది. 

దీంతో బొలేరో వాహనంలో ఉన్న వెదురు కర్రలు ట్రావెల్స్‌ బస్సు ముందు భాగంలోకి చొచ్చుకుపోయాయి. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్ర­మా­దంలో ట్రావెల్స్‌ బస్సు ముందు సీటులో కూర్చున్న వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్ధన్‌రెడ్డి (54) పొట్టలోకి వెదురు కర్ర చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు బస్సుల డ్రైవర్లతోపాటు మరో 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

క్షతగాత్రులను కొనకనమిట్ల పోలీసులు కనిగిరి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. జనార్ధన్‌రెడ్డి మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో వచి్చన భారీ శబ్దానికి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచి ఏమైందో తెలియక చీకట్లో తీవ్ర భయాందోళనలకు గురై ఆర్తనాదాలు చేశారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)