Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

Published on Mon, 11/27/2023 - 07:22

సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో ఆయన తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహా ద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు.

టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రధానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు. మూలవిరాట్టు దర్శనం చేసుకున్నారు. అనంతరం హుండీ లో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.

టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. టీటీడీ డైరీ, క్యాలండర్‌లను ప్రధానికి అందించారు. ఆయన సుమారు 50 నిముషాల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం రచన అతిథి గృహానికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధానికి పర్యటన సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. ప్రధాని వెళ్లే మార్గాలలో ఉన్న దుకాణాలు మూసివేశారు. వాహన రాకపోకలు నిషేధించారు. ప్రధాని పర్యటనకు మీడియాని కూడా అనుమతించలేదు.

కాగా, ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం వైఎస్‌ జగన్‌ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు.
చదవండి: జనం మెచ్చిన 'జగన్‌'

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)