Breaking News

బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే

Published on Thu, 11/02/2023 - 04:33

సాక్షి, అమరావతి: కంటి శస్త్ర చికిత్స కోసం తాత్కాలిక బెయిల్‌ పొందిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టు విధించిన బెయిల్‌ షరతులను అప్పుడే ఉల్లంఘించడం మొదలు పెట్టారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. అనారోగ్యం సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే రాజకీయ ర్యాలీ ప్రారంభించారని, జైలు బయటే మీడియాతో కూడా మాట్లాడారని తెలిపారు.

హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులతో మంగళవారం తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. వీటికి అదనంగా మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చంద్రబాబు మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం, కేసు గురించి మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడానికి వీల్లేదంటూ ఆదేశించింది.

సీఐడీ అనుబంధ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసి కూడా చంద్రబాబు వాటికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. తాము అదనపు షరతులు విధించాలని ఎందుకు మొత్తుకుంటున్నామో దీనినిబట్టి అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కోర్టుకు సమర్పించి, దానిని పరిశీలించాలని కోరారు.  చంద్రబాబు కోర్టు షరతులకు లోబడి వ్యవహరిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఆ అధికారులు చంద్రబాబు స్వేచ్ఛకు ఏ రకంగానూ భంగం కలగనివ్వబోరని, ఇది తాము ఇస్తున్న హామీ అని నివేదించారు. మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌లో కోర్టు ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు తెలిపా­రని సుధాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు జోక్యం చేసుకుంటూ.. మీ వద్ద ఇంటెలిజెన్స్‌ ఉందిగా.. దాని సాయంతో చంద్రబాబుపై నిఘా పెట్టొచ్చుగా అని వ్యాఖ్యానించారు. నిఘా వేరు, ఓ వ్యక్తి వెంట వెళ్లడం వేరని, నిఘా అనేది వ్యక్తికి తెలియకుండా చేసేదని సుధాకర్‌రెడ్డి వివరించారు.

అనంతరం చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు విని­పిస్తూ.. సీఐడీ కోరు­తున్న అదనపు షరతులు దర్యాప్తు కోసం కాదని, ఇతర కారణాలున్నాయని అన్నారు. సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు ప్రభావితం కాకుండా ఉండేందుకే బెయిల్‌ మంజూరు సమయంలో న్యాయస్థానాలు షరతులు విధిస్తాయన్నారు.

చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా కోర్టు షరతులను ఉల్లంఘించలేదని, ర్యాలీలో పాల్గొనలేదన్నారు. ఆయనకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు ఆయన వద్దకే ప్రజలు వచ్చారన్నారు. న్యాయస్థానం షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దును కోరే స్వేచ్ఛ సీఐడీకి ఉందని, అందువల్ల సీఐడీ కోరుతున్న విధంగా షరతులు విధించాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు అదనపు షరతుల విషయంలో శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని తెలిపారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)