Breaking News

తాడిపత్రిలో టెన్షన్‌.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Published on Sat, 06/14/2025 - 07:22

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరిన కేతిరెడ్ఢి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారి తీసింది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో భాగంగా పోలీసులు.. ఆయనతో అనుచితంగా ప్రవర్తించినట్టు సమాచారం. 

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్ఢి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా పోలీసులు తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా.. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. కేతిరెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదు. ఇ‍ప్పటి వరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. మరోవైపు.. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు సిద్ధంగా ఉన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే.. కచ్చితంగా దాడులు చేస్తామని గతంలోనే జేసీ ప్రభాకర్‌ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్‌ ఇచ్చారు. 

తాడిపత్రిలో మరోసారి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)