Breaking News

AP: పాలన బాగుంటే పోలింగ్‌ పెరుగుతుంది

Published on Fri, 05/17/2024 - 05:49

సాక్షి, అమరావతి: పరిపాలన నచ్చితే ప్రజలు తమ మద్దతు ఓట్ల రూపంలో చూపిస్తారని, అందుకు అనుగుణంగానే పోలింగ్‌ శాతం పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌కు, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్‌కు ప్రజలు వరు­సగా రెండుసార్లు అధికారం కట్టబెట్టటాన్ని ఇందుకు నిదర్శ­నంగా ఉదహరి­స్తున్నారు. 

ఇప్పుడు ఏపీ­లోనూ అదే ట్రెండ్‌ కనిపిస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాట నిల­బెట్టుకున్న జగన్‌ ప్రభుత్వానికి మరోసారి పట్టం గట్టడం ఖాయమని, అందుకనే పోలింగ్‌ శాతం పెరిగిందని విశే­్లషిç­Ü్తున్నారు. పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తోందనే ప్రచారంలో నిజం లేదని సీని­యర్‌ రాజకీయ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చితే నిస్సంకోచంగా మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని పేర్కొంటున్నారు.

ఈ మంచి కొనసాగేలా..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం హామీలను అమలు చేయడంతోపాటు పథకాలన్నీ  కొనసాగిస్తామని ప్రజల్లో విశ్వాసం కల్పించడంతో పెద్ద ఎత్తున పోలింగ్‌కు తరలి వచ్చారని, ఈ మంచి కొనసాగాలని కోరుకుంటున్నారనేందుకు పోలింగ్‌ శాతం పెరగడమే రుజువని సీనియర్‌ రాజకీయవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 2019లో కంటే 2024లో పోలింగ్‌ శాతం పెరగడం వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాలన్న ఆకాంక్షలకు సంకేతమని పేర్కొంటున్నారు.

వైఎస్సార్‌ పాలనే రుజువు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 69.8 శాతం పోలింగ్‌తో దివంగత వైఎస్సార్‌ అధికారం చేపట్టారు. 2004 నుంచి 2009 వరకు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 2009 ఎన్నికల్లో 72.7 శాతం పోలింగ్‌తో ప్రజలు మరోసారి వైఎస్సార్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు.

విద్య, వైద్య రంగాలలో తొలిసారిగా పెను మార్పులు తెచ్చిన వైఎస్సార్‌కు జేజేలు పలికారు. పోలింగ్‌ శాతం పెరగడం వల్ల వైఎస్సార్‌కు ప్రజల మద్దతు పెరిగినట్లు స్పష్టంగా కళ్లెదుట కనిపించిన వాస్తవమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2004కు మించి 2009లో పోలింగ్‌ 2.9 శాతం పెరిగింది.

కేసీఆర్‌కు రెండుసార్లు అధికార పగ్గాలు..
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2014 ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా కేసీఆర్‌ అధికారం చేపట్టారు. కేసీఆర్‌ పాలన నచ్చడంతో 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్‌తో మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

సానుకూల ప్రచారంతో..
ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్‌తో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా దీవించారు. ఐదేళ్ల సీఎం జగన్‌ పాలన నచ్చడంతో పాటు పథకాలన్నీ కొనసాగాలని ప్రజలు కోరుకోవడంతో ఈదఫా పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేశారని, అందుకే పోలింగ్‌ శాతం 81.86 శాతానికి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్లీ సీఎంగా జగనే ఉండాలని ప్రజలు భావిస్తున్నారనేందుకు గత ఎన్నికల కంటే పోలింగ్‌  అదనంగా 2.09 శాతం పెరగడం సంకేతమని స్పష్టం చేస్తున్నారు.

 ఐదేళ్లుగా మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే ఓటుతో ఆశీర్వదించాలని, సైనికులుగా తోడుగా నిలవాలని, పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని సీఎం జగన్‌ ఎన్నికల్లో సానుకూల ప్రచారం చేయడం ప్రజలకు నచ్చిందని, అందుకే ఓట్ల రూపంలో జేజేలు పలికారని సీనియర్‌ రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు.   

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)