Breaking News

రెచ్చిపోయిన సీఐ.. తిరగబడ్డ జనం

Published on Tue, 03/25/2025 - 08:13

గుంటూరు: శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన సీఐ రెచ్చిపోవడంతో ఓ మా­మూలు వివాదం శాంతిభద్రతలకే విఘా­తం కలిగించే పరిస్థితికి దారితీసింది. ఫిర్యాదు చేసిన దళితులపైనే విచక్షణ మరిచి తన ప్రతాపం చూపడంతో.. ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది.  ఓ యు­వకు­డిని సీఐ తుపాకీతో కొట్టడంతో న్యాయం చేయాల్సిన తమపైనే దాడిచేయడం ఏమిటని ప్రజలు ముట్టడించడంతో సదరు సీఐ అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. ఆగ్రహించిన ప్రజలు స్థానిక అంబేడ్కర్‌ బొమ్మ వద్ద రోడ్డుపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలోని శాంతిపేటలో పోలేరమ్మ ఆలయ స్థలం ఉంది.

ఈ స్థలాన్ని స్థానిక వ్యక్తి ఒకరు తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఆ స్థలంలో సోమవారం షెడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ మురళీ, తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడికి ఫిరంగిపురం సీఐ బి.రవీంద్రబాబు హోంగార్డుతో అక్కడికి చేరుకున్నా­రు. వచ్చీ రావడంతో అక్కడ గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యా­యి. ఫిర్యాదు చేసిన తమపైనే దాడి చేయడమేమిటని అక్కడి యువకులు ప్రశ్నించడంతో సీఐ ఆగ్రహానికి గురయ్యారు.

తన గన్‌ బయటకుతీసి అఖిల్‌ అనే యువ­కుడిని కొట్టడంతో అతనూ గాయ­పడ్డాడు. దీంతో స్థానికులు సీఐ రవీంద్రబాబును ముట్టడించడంతో ఆయన అక్కడి నుంచి ఆటోలో జారుకున్నారు. అనంతరం.. దళితులు సీఐ డౌన్‌ డౌన్‌ అంటూ స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న గుంటూరు డీఎస్పీ భానూదయ మేడికొండూరు, నల్లపాడు సీఐలు నాగూల్‌ మీరా, వంశీధర్‌తో అక్కడికి చేరుకుని ఆందోళనకా­రు­లతో మాట్లాడారు. సీఐపై చర్యలు తీసుకో­వాల్సిందేనని స్థానికులు పట్టుబట్టడంతో వారికి సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)