Breaking News

ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం

Published on Thu, 05/16/2024 - 07:34

తాడిపత్రి అర్బన్‌: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏకపక్షంగా వ్యవ­హ­రి­స్తున్నారు. మంగళవారం జరిగిన అల్లర్ల అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కేతి­రెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లి­పోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోని గదులకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఎవరూ ఊహించని రీతిలో పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. 

అక్కడ నిద్రి­స్తున్న పని మనుషులను నిద్రలేపి ఇంటి తలుపులు తీయాలని బలవంతం చేశారు. తమ వద్ద తాళాలు లేవని చెప్పడంతో పోలీసులు అక్కడే ఉన్న వంట చేసే కబ్‌గిరి(పెద్ద పొడవైన గరిటె)తో ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను పగులగొట్టి హార్డ్‌ డిస్క్‌లను మాయం చేశారు. కాన్ఫరెన్స్‌ హాలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అక్కడున్న ఫ్యాన్, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 

ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
పోలింగ్‌ రోజు నుంచి తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తు­న్నా­యి. ముఖ్యంగా అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీ గూండా­లను రెచ్చగొడుతూ వైఎస్సార్‌సీపీ నేత­లను టార్గెట్‌ చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా ఎదుట మండిపడ్డారు. 

పోలింగ్‌ రోజున కూడా టీడీపీ నేతల వైపు వారు కన్నెత్తి చూడ­కుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేశారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మి­త్‌రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది అనుచరులను వెంటేసుకుని రోడ్లపై హల్‌­చల్‌ చేసినా వారించలేదు. ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీప­క్‌­రెడ్డి తన వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతికించు­కుని తిరిగినా పోలీసులు ప్రశ్నించలేదు. ఎమ్మెల్యే పెద్దా­రెడ్డి లక్ష్యంగా టీడీపీ అల్లరి మూకలు దాడు­లకు పాల్పడుతున్నా ఆయన ఇంటి ముందు బందో­బస్తు ఏర్పాటు చేయలేదు. మంగళవారం ఘర్షణల అనంతరం డీఐజీతో సహా రాయలసీమ జిల్లాల నుంచి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకున్నాయి. 

కానీ ఎమ్మెల్యే ఇంటి ముందు మాత్రం నామమాత్రపు బందోబస్తు ఏర్పాటు చేసి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నివా­సం వద్ద మాత్రం పెద్ద ఎత్తున బలగాలను మోహ­రింపజేశారు. అంతేగా­కుండా సోమ, మంగళవా­రాల్లో జరిగిన దాడు­లతో ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. వారిని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఎఫ్‌­ఐ­ఆర్‌ కూడా నమోదు చేయకుండానే పోలీస్‌ స్టేష­న్‌­లో నిర్బంధించారు. మరికొందరిని కౌన్సెలింగ్‌ పేరిట ఇష్టారాజ్యంగా కొడుతున్నట్లు సమాచారం. తాడిపత్రి పోలీసుల ఏకపక్ష వైఖరి, తన ఇంట్లోకి చొర­బడి విధ్వంసం సృష్టించడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.

మీడియాపై ఎస్పీ ఆంక్షలు
తాడిపత్రిలో వరుసగా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి న్యూస్‌ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిథులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. గొడవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించకూడదని సాక్షాత్తు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఆంక్షలు విధించడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాస సమీపంలో అద­నపు ఎస్పీ రామకృష్ణతో బందోబస్తుపై ఆయన సమీక్షిస్తుండగా ఫొటోలు తీస్తున్న ఓ విలేకరిపై ఆయన చిందులు తొక్కారు. సెల్‌ ఫోన్‌ తీసుకోండంటూ అక్కడే ఉన్న తన గన్‌మన్లను ఆదేశించారు. 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)