Breaking News

పెంచలయ్య హత్య కేసులో పురోగతి

Published on Sun, 11/30/2025 - 15:15

సాక్షి, నెల్లూరు జిల్లా: ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కుట్రదారు ఆరని కామాక్షిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. బోణిగానితోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు  సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏ1 నిందితుడు జేమ్స్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. జేమ్స్‌ కాలు​కి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పెంచలయ్య హత్య‌ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘‘పెంచలయ్య గంజాయి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తుండేవాడు. అదే కాలనీకి చెందిన గంజాయి వ్యాపారి ఆరవ కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకొంది. తన వ్యాపారానికి అడ్డం వస్తున్నాడని హతమార్చడానికి కుట్ర పన్నింది. స్కూల్ నుంచి బిడ్డను తీసుకొస్తున్న క్రమంలో పెంచలయ్యపై దాడి చేశారు

..పది మంది పాశవికంగా పొడిచి చంపారు. A1 జేమ్స్ ను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. నేడు కామాక్షిని గంజాయి పట్టుబడ్డ కేసులో అరెస్టు చేశారు. పీటీ వారెంట్ కింద ఈ కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకుంటాం. ఈ హత్య కేసులో మొత్తం 14 మంది వున్నారు. 9 మందిని అరెస్ట్ చేశాం. మిగతా ఐదుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.

ప్రజానాట్య మండలి, డీవైఎఫ్‌ఐ ఆగ్రహం
కామ్రేడ్‌ పెంచలయ్యను గంజాయి గూండాలు హత్య చేయడంపై  ప్రజానాట్య మండలి, డీవైఎఫ్‌ఐ నేతలు మండిపడ్డారు. కామ్రేడ్‌ పెంచలయ్య హత్యకు గురికావడంపై తీవ్ర ఆవేదన  వ్యక్తం చేశారు. ఏపీలో గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయని డీవైఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)