Breaking News

రక్షకులా.. రాక్షసులా!

Published on Thu, 01/08/2026 - 07:14

గుంటూరు జిల్లా: ‘బూటు కాళ్లతో మా పిల్లలను తొక్కుతారా? పన్నెండు మంది కలిసి పోల్‌ పీక్కెళితే అందులో నలుగురు దళిత బిడ్డలను మాత్రమే స్టేషన్‌కు పిలిపించి లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టడమేంటి?’ అంటూ అప్పాపురం దళితవాడ ప్రజలు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి చెప్పే కనీస జ్ఞానం కూడా లేదా? లాఠీలతో కొట్టి అక్కడే నడిపిస్తారా’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన పన్నెండు మంది విద్యార్థులు వాలీబాల్‌ నెట్‌ కట్టుకునేందుకు సోమవారం ఓ వీధిలో ఉన్న టెలిఫోన్‌ స్తంభాన్ని(పోల్‌) తొలగించి, తీసుకెళ్లారు. ఆ సమయంలో స్తంభానికి చుట్టి ఉన్న విద్యుత్‌వైర్లు కదిలి ఇళ్లలో ఉన్న విద్యుత్‌ పరికరాలు దెబ్బతిన్నాయంటూ ఓ మహిళ కాకుమాను పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం వారిలో నలుగురు యువకులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కొట్టారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి తల్లిదండ్రులు స్టేషను వద్దకు వెళ్లి పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

నాలుగు గంటల పాటు రాస్తారోకో 
‘మా పిల్లలను బూటు కాళ్లతో తొక్కి, లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టిన ఎస్‌ఐ ఏక్‌నాథ్‌ను సస్పెండ్‌ చేయాలి. కులం పేరుతో దూషించిన ఏఎస్‌ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఉదయం అప్పాపురం దళితవాడ వాసులు బాధిత విద్యార్థులు, యువకులతో కలిసి మెయిన్‌ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పన్నెండు మందిలో అగ్రవర్ణాల పిల్లలు కూడా ఉన్నారని, కానీ వాళ్లను వదిలేసి దళిత బిడ్డలనే స్టేషన్‌కు పిలిపించి దాడి చేయడం ఏంటని ప్రశి్నంచారు. చదువుకునే పిల్లలను ఇలా విచక్షణారహితంగా కొట్టడం ఏమిటంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. 

బాధిత యువకులు, విద్యార్థులు స్టేషన్‌లో సీసీ కెమెరాల్లేని గదిలోకి తీసుకువెళ్లి పోలీసులు అమానుషంగా దాడి చేశారని వాపోయారు. స్టీల్‌ రాడ్లతో సైతం కొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో వందల మంది మహిళలు, స్థానికులు రాస్తారోకోలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది.  దళితసంఘ నాయకుడు చార్వాక దళితులకు మద్దతు పలికి, రాస్తారోకోలో పాల్గొన్నారు. దళిత బిడ్డలపై అబద్ధాలతో ఫిర్యాదు చేసిన మహిళతో పాటు కులం పేరుతో తమను, తమ పిల్లలను దూషించిన ఎస్‌ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ చార్వాక దళితవాడ ప్రజలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో చివరికి వారు శాంతించారు. కాగా, పోలీసుల దాషీ్టకానికి బలైన దళిత విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌ అండగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం అప్పాపురం దళితవాడలో పర్యటించిన ఆయన బాధిత విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనను ఇంతటితో వదిలేది లేదని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)