‘అక్కా అంటూనే.. ఇలాంటి మెసేజీలు ఏంట్రా?’

Published on Tue, 03/10/2026 - 08:49

సాక్షి, సత్యసాయి జిల్లా: అతనో ఆకతాయి...పచ్చ నేతల   పంచన చేరాడు. మద్యం మత్తులో పిచ్చి ముదిరి మహిళలను టార్గెట్‌ చేశాడు. అక్కా అంటూనే ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడాడు. ఆమె చెప్పు  తీస్తాననే సరికి కాళ్లబేరానికొచ్చాడు. ఆ తర్వాత    అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో మెలుగుతూ సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం వాగడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కూడా సోషల్‌ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు స్పందించారు. అతణ్ని కొన్నేళ్ల క్రితమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు పేర్కొంటూ.. చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

తాగుడు...వాగుడు.. 
పులేటిపల్లికి చెందిన బి.భాస్కర్‌రెడ్డి మద్యం మత్తులో పలువురు మహిళలకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడటం పరిపాటిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. ఓ మహిళను వేధింపులకు గురి చేసే విధంగా మెసేజీలు (రాయలేని భాషలో) చేయడంతో పాటు.. ఫోన్‌లో మాట్లాడిన ఉదంతం వెలుగు చూసింది. భాస్కర్‌రెడ్డి చేష్టలను గమనించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి.. గతంలోనే అతన్ని వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్‌ చేయించారు. ప్రస్తుతం అతను ‘పరిటాల’ కోటరీకి అనుకూలంగా ఉంటూ.. నిత్యం మద్యం సేవిస్తూ.. వైఎస్సార్‌సీపీని, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ లేనిపోని అభాండాలు వేస్తూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలో వార్తలు రాయిస్తున్నాడు. 

అధికారులను బెదిరించి.. 
తమ ప్రభుత్వం అధికారంలో ఉందంటూ.. రెవెన్యూ అధికారులను బెదిరించి కొన్ని భూములు కూడా కాజేశాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ సామాన్య ప్రజలను సైతం భాస్కర్‌రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. పులేటిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని గతంలోనే పలుమార్లు వెల్లడించినట్లు చెన్నేకొత్తపల్లి మండల వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సన్నిహితుల కనుసన్నల్లో నడుస్తూ.. వైఎస్సార్‌సీపీపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని అతనికి సూచించారు. 

‘చెప్పుతో కొడతా భాస్కర్‌’.. 
ఓ మహిళతో పులేటిపల్లి భాస్కర్‌రెడ్డి మాట్లాడిన ఆడియో సంభాషణ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అందులో  ‘ఏం భాస్కర్‌.. అక్కా అంటావ్‌.. తలకాయ తిరిగే కూతలు కూస్తావా? నీ స్మైల్‌ బాగుంది.. ఐ లైక్‌ యూ.. ఐ లవ్‌ యూ అని మెసేజీలు చేస్తావా? పులేటిపల్లికి వచ్చి చెప్పుతో కొడతా.. ఏం అనుకుంటున్నావో! గతంలో కూడా ఓసారి వార్నింగ్ ఇచ్చినా..  అయినా మారలేదు. నీ పెళ్లాంతోనే చెప్పుతో కొట్టిస్తా. అక్కా అంటావ్‌.. ఇలాంటి మెసేజీలు చేస్తావా? నీ నంబరు కూడా నా దగ్గర లేదు. కొవ్వు పట్టి చేస్తున్నావ్‌. ఒకట్రెండు సార్లు కాదు.. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇలా చేశావ్‌. కళ్లు తిరుగుతున్నాయా? బట్టలు ఊడదీసి ఊరేగిస్తా..’ అంటూ మహిళ ఘాటుగా హెచ్చరించారు. 

తగ్గి మాట్లాడిన భాస్కర్‌.. 
‘అక్కా.. ఇంకోసారి మిస్టేక్‌ జరగదు. నేను స్థానికంగా లేను. బెంగళూరులో ఉన్నాను. ఏదో తెలియక చేసినా. నా గురించి తెలుసు కదా అక్కా. ఈసారికి వదిలెయ్‌ ప్లీజ్‌’ అంటూ బతిమాలాడు. నువ్వంటే గౌరవం అక్కా అంటూ నమ్మబలికాడు.  

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)