Breaking News

పోలీసులపైనా దాడులు చేశారు: సీఎం జగన్‌

Published on Sat, 10/21/2023 - 08:06

సాక్షి, విజయవాడ: సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన ‍యోధుడు పోలీస్‌. ఖాకీ డ్రెస్‌ అంటే త్యాగనీరతి అని. పోలీస్‌ ఉద్యోగం అనేది ఓ సవాల్‌.. బాధ్యత. అలాంటి పోలీస్‌ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్‌ సిబ్బందికి నివాళులర్పించారు.

‘‘అక్టోబర్‌ 21 పోలీస్‌ అమరుల సంస్మరణ దినం. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో అమరులైన పోలీస్‌ త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు. దేశప్రజలంతా మన పోలీసులను మనసులో సెల్యూట్‌ చేసే రోజు. ఈ రోజున అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని సీఎం జగన్‌ ప్రసంగించారు.  విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్‌ సోదరులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. 



విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. సాంకేతికతకు తగ్గట్లు అప్‌డేట్‌ కావాలి. అసాంఘీక శక్తులు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అణచి వేయాలి. అలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలు చేయాలి. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదు. 

అంగళ్లులో ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించింది. పుంగనూరులో ఘటనలో 40 మంది పోలీస్‌ సిబ్బందికి గాయలు అయ్యాయి. ఓ పోలీస్‌ కన్ను కోల్పోయారు. న్యాయమూర్తలుపైనా ట్రోలింగ్‌ చేస్తున్నారు. అలాంటి దుష్టశక్తుల విషయంలో కఠినంగా ఉండాలి అని పోలీసులకు సూచించారాయన. 

ఏపీలో పోలీస్‌ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. ఏపీతో పాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా చికిత్స అందిస్తోంది.  


Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)