Breaking News

మహిళననీ చూడకుండా లాఠీలతో కొట్టారు

Published on Fri, 04/18/2025 - 03:39

తిరుపతి సిటీ: ఒక భూమి విషయంలో అబద్ధాలు చెప్పాలంటూ తనను తిరుచానూరు స్టేషన్‌కు ఈడ్చుకెళ్లిన పోలీసులు లాఠీలతో కుళ్లబొడిచారని స్థానిక సుందరయ్య నగర్‌కు చెందిన ఇ.హేమలత అనే మహిళ విలపించింది. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటి పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్న తనను మంగళం కృష్ణవేణి యాదవ్‌ కాలనీకి సంబంధించిన భూమి విషయమై మాట్లాడాలని తిరుచానూరు పోలీసులు బూతులు తిడుతూ స్టేషన్‌కు లాక్కెళ్లారని తెలిపింది. 

పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సాయినాథ్‌చౌదరి, మహిళా కానిస్టేబుల్‌ సునీత, ఇతర సిబ్బంది తనవద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.23 వేల నగదు, చేతి వేలి ఉంగరం లాక్కున్నారని ఆరోపించింది. ఆ తరువాత ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి సమక్షంలో కానిస్టేబుల్‌ సునీత జుట్టు పట్టుకుని ఈడ్చి  మెడపై బలంగా గుద్దుతూ బూతులు తిడుతూ కొట్టిందని ఆరోపించింది. 

తన ఎడమ చేతిని వెనక్కి తిప్పి లాఠీతో అతి దారుణంగా కొట్టారని, కుడి చేయి తిప్పి రబ్బరు టైరులాంటి వాటితో విపరీతంగా కొట్టి గాయపరిచారని విలపించింది. ఆ భూమిని కొనుక్కున్న వాళ్లు తనకు డబ్బులు ఇవ్వలేదని చెబితే తనను వదిలేస్తామని, లేదంటే తనపై బ్రోతల్‌ కేసు, తన కుమారుడిపై గంజాయి కేసు పెడతామని బెదిరించారని పేర్కొంది. ఈ వ్యవహరమంతా మంగళం వార్డు మెంబర్‌ నాగయ్య సమక్షంలో జరిగిందని తెలిపింది. 

అనంతరం ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సాయిలక్ష్మి, జయంతి మాట్లాడుతూ మహిళ అని కూడా చూడకుండా అతికిరాతకంగా కొడుతూ కులం పేరుతో దూషించిన ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి, మహిళా కానిస్టేబుల్‌ సునీతను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మహిళా సంఘాలు ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఎస్పీకి వినతిపత్రం అందజేస్తామన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)