Breaking News

బాధితుడినే నిందితుడిగా మార్చారు

Published on Wed, 12/04/2024 - 05:42

సాక్షి, అమరావతి: బాధితుడినే నిందితుడిగా మా­ర్చి.. నిందితులకు పోలీసులు మద్దతు పలుకుతు­న్నారని కుక్కల విద్యాసాగర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి ఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సినీ నటి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తన­కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వ్యాపా­రవేత్త కుక్కల విద్యాసాగర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సినీనటి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు విద్యాసాగర్‌ నుంచి బలవంతంగా రూ.కోటి వరకు గుంజితే.. పోలీసులు రివర్స్‌లో అతనిపైనే కేసుపెట్టి ప్రాసిక్యూట్‌ చేయాలంటున్నారని వివరించారు. జత్వానీకి సంబంధించిన మొబైల్‌ ఫోన్లు, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం ఉందని, డబ్బు కోసం విద్యాసాగర్‌ను బెదిరించిన మెసేజ్‌లు అందులో ఉన్నాయని తెలిపారు.

అందుకే వాటిని భద్రపరచాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. జత్వానీ చాటింగ్‌ మెసేజ్‌లను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టడం లేదని తెలిపారు. జత్వానీ రెండు ఆధార్‌ కార్డులు కలిగి ఉన్నారని, కేంద్రం ఎవరికీ రెండో ఆధార్‌ కార్డు ఇవ్వదన్నారు. జత్వానీ సోదరుడికి అండర్‌ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, ఈ విషయంలో కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఇందుకు జత్వానీని ఓ సాధనంగా వాడుకుంటోందన్నారు.

ఆ బాధ్యత పోలీసులపై ఉంది
నిరంజన్‌రెడ్డి వాదనలపై హైకోర్టు స్పందిస్తూ.. ఇలాంటి కీలక విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట 
మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసులో సురేష్‌ రి­మాండ్‌ను కోరవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దని  హైకోర్టు ఆదేశించింది. 

ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాలని నందిగంను ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో పోలీసుల తరఫున పీపీ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను ఈ నెల 16కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)