Breaking News

ప్రధాని విశాఖ షెడ్యూల్‌ ఖరారు

Published on Mon, 11/25/2024 - 04:52

సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ప్రాథమిక షెడ్యూల్‌ ప్రకారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభ, రోడ్‌ షోలో ప్రధాని పాల్గొననున్నారు. 29న సాయంత్రం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో తూర్పు నౌకాదళానికి చెందిన ఎయిర్‌బేస్‌ ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాన్వెంట్‌ జంక్షన్, రైల్వే స్టేషన్, సంపత్‌ వినాయక్‌ టెంపుల్, టైకూన్, సిరిపురం జంక్షన్‌ మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్డు నుంచి ప్రధాన వేదిక వద్దకు 4.40 గంటలకు వస్తారు.

టైకూన్‌ జంక్షన్‌ నుంచి ఎస్‌పీ బంగ్లా వరకు 500 మీటర్ల మేర నిర్వహించే రోడ్‌షోలో ప్రధాని పాల్గొని బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ నిర్దేశించిన బహిరంగ సభ కార్యక్రమంలో 4.45 నుంచి 5.00 గంటల వరకు గవర్నర్, సీఎం, ఉప ముఖ్యమంత్రితో కలిసి పాల్గొని ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌తో పాటు, రైల్వే లైన్లు, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్ని ప్రధాని చేయనున్నారు. 

సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల అనంతరం సాయంత్రం 5.25 నుంచి 5.43 గంటల వరూ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. అనంతరం.. సాయంత్రం 5.45 గంటలకు సభా వేదిక నుంచి ఎయిర్‌ పోర్టుకు తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు.

PM Modi AP Tour: మోదీ విశాఖ టూర్ ..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)