Breaking News

నేడు ఐఐఎం విశాఖ ప్రారంభం 

Published on Tue, 02/20/2024 - 03:27

సాక్షి ప్రతినిధి, విశాఖపట్న­ం­­/రేణిగుంట (తిరుపతి జిల్లా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటి అయిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)– విశాఖపట్నం శాశ్వ­త క్యాంపస్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం–విశాఖ  కార్యకలాపాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాల్ని ఉచితంగా కేటాయించింది.

ఇందులో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో రూ.472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్‌ ఏరియాని అభివృద్ధి చేశారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. అడుగడుగునా అద్భుతమనేలా హరిత భవనం (గ్రీన్‌ బిల్డింగ్‌), స్మార్ట్‌ భవనంగా దీన్ని తీర్చిదిద్దారు. 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ ప్లాంటును నిరి్మంచారు. దీని ద్వారా సంవత్సరానికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధులు ‘యు’ ఆకారంలో కూర్చొనేలా తరగతి గదులు నిర్మించారు. 

తిరుపతి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ శాశ్వత క్యాంపస్‌లు కూడా.. 
తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) శాశ్వత క్యాంపస్‌లను కూడా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పేడు సమీపంలోని రెండు క్యాంపస్‌లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పేడు సమీపంలో రెండు విద్యా సంస్థలకు 895 ఎకరాలను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జాతికి అంకితం చేసే కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ, ఐఐఎస్‌ఈఆర్‌ డైరెక్టర్‌ శంతాను భట్టాచార్య పాల్గొంటారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)