ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు
Published on Sun, 06/01/2025 - 11:09
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టి.. కలకలం రేపింది. ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్లింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరిన ఫలితం శూన్యం.
ఇవాళ విమానం చక్కర్లపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో దాడి తర్వాత తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో తిరుమల ఉందని.. ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ గత నెల 8న కూడా తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags : 1