Breaking News

మహిళలకు కూటమి సర్కారు కుచ్చుటోపీ

Published on Tue, 05/13/2025 - 06:02

అమలాపురం టౌన్‌: బీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ, శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం రూ.245 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మహిళలు రోడ్డెక్కారు. కుట్టు మెషీన్లను వెంటబెట్టుకుని మరీ జిల్లా కేంద్రమైన అమలాపురం చేరుకుని నిరసన తెలిపారు. గడియారం స్తంభం సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌­చంద్రబోస్‌ మాట్లాడుతూ.. రూ.4,300 విలువైన కుట్టు మెషిన్‌ను కమీషన్ల కక్కుర్తితో రూ.23,500కు కూటమి ప్రభుత్వం అడ్డదారుల్లో పెంచిందని ధ్వజమెత్తారు.

ఇన్నాళ్లూ బీసీ కులగణన లేకే ఇలాంటి స్కామ్‌లకు అవకాశం ఏర్పడుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. కుట్టు మెషీన్ల పేరుతో రూ.245 కోట్ల మేర మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన కుంభకోణంపై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఈ వారంలోనే రిలే నిరాహార దీక్ష, పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచి దిగి వచ్చేలా చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బాటలో కూటమి ప్రభుత్వ కుట్టు మెషీన్ల స్కామ్‌పై కూడా పోరాటం మొదలు పెట్టామన్నారు.

కూటమి ప్రభుత్వం స్కీమ్‌ల పేరుతో సాగించిన కుంభకోణాల దందాను జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పినిపే విశ్వ­రూప్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారా­యణ­రావు, బొమ్మి ఇజ్రాయిల్, రాజోలు, అమలా­పురం, రామచంద్రపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కో–ఆర్డినేటర్లు గొల్లపల్లి సూర్యారావు, డాక్టర్‌ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)