టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శన

Published on Wed, 09/17/2025 - 07:48

తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. రూ.6,400 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. దీంతో వేలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. 2024–25 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్‌ కుమార్‌ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు.

 ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్‌మెంట్‌æ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని కారణం చూపి విద్యార్థుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీల కో–ఆర్డినేటర్‌ అశోక్‌ కుమార్‌ ఇతర విద్యార్థులు వినోద్‌కు మద్దతుగా నిలిచారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)