Breaking News

‘ఇన్నర్‌’లోనూ చుక్కెదురు

Published on Tue, 10/10/2023 - 05:38

సాక్షి, అమరావతి :ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పులో అక్రమాలు, క్విడ్‌ ప్రో కోకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఏ–1 నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో కూడా తాను కస్టడీలోనే ఉన్నట్లు (డీమ్డ్‌ కస్టడీ) భావించాలన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు రెండూ వేర్వేరు కేసులని, రెండూ కూడా వేర్వేరు లావాదేవీలకు సంబంధించినవని, రెండు కేసుల్లో దర్యాప్తు అధికారులూ వేర్వేరని, విచారించిన సాక్షులు, సేకరించిన సాక్ష్యాలు కూడా వేర్వేరని హైకోర్టు స్పష్టంచేసింది. అందువల్ల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీలో ఉన్నట్లు (డీమ్డ్‌) భావించడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంగానీ, జ్యుడీషియల్‌ కస్టడీకి రిమాండ్‌ చేయడంగానీ జరగలేదని, అందువల్ల ఆయన బెయిల్‌కు అర్హులుకాదని స్పష్టంచేసింది. 

చంద్రబాబు వాదనలో బలంలేదు
2022లో నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు తనను అరెస్టుచేయకపోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, తనను మరింత కాలం జైలులో ఉంచేందుకే ఇలా చేస్తున్నారంటూ చంద్రబాబు వాదనలో ఎలాంటి బలంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు నమోదైన విషయం చంద్రబాబుకు బాగా తెలుసునని, ఇదే కేసులో ఏ–2 నుంచి ఏ–5 వరకు నిందితులు ముందస్తు బెయిళ్లు కూడా పొందారని న్యాయస్థానం గుర్తుచేసింది. ముందస్తు బెయిల్‌ విషయంలో చంద్రబాబు ఇన్నేళ్లు నిద్రపోయి, ఇప్పుడు పోలీసులను నిందిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.

స్కిల్‌ కేసులో అరెస్టుచేసిన మరుసటిరోజే చంద్రబాబును ఇన్నర్‌ కేసులో కూడా కోర్టు ముందు హాజరుపరచాలంటూ సీఐడీ సీఆర్పీసీ సెక్షన్‌–267 కింద సంబంధిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిందని గుర్తుచేసింది. అలాగే, ఈ బెయిల్‌ పిటిషన్‌ను తన సరెండర్‌ పిటిషన్‌గా భావించి, తనకు బెయిల్‌ మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు అభ్యర్థనను సైతం హైకోర్టు తిరస్కరించింది. అలాగే, ఇన్నర్‌ కేసులో హైకోర్టు ముందు చంద్రబాబు భౌతిక హాజరుగానీ, వాస్తవిక లొంగుబాటు గానీ సాధ్యంకాదని, తన పిటిషన్‌లో చంద్రబాబు ఎక్కడా కూడా తాను హైకోర్టు ముందు లొంగిపోయేందుకు అనుమతినివ్వాలని కూడా కోరలేదని తెలిపింది. అలాంటి అభ్యర్థన ఏదీ లేనప్పుడు, ఈ పిటిషన్‌ను సరెండర్‌ పిటిషన్‌గా భావించలేమని తేల్చిచెప్పింది.

అలాగే, బెయిల్‌ విషయంలో ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని కూడా స్పష్టంచేసింది. అంతేకాక.. ఒకవేళ కోర్టు స్కిల్‌ కేసులో తన కస్టడీని ఇన్నర్‌ కేసులో డీమ్డ్‌ కస్టడీగా భావించని పక్షంలో, తాను దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా పరిగణించి, ముందస్తు బెయిల్‌ మంజూరు విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి ఏ మాత్రం వెళ్లడంలేదని, కేవలం డీమ్డ్‌ కస్టడీ అంశానికే పరిమితం అవుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి సోమవారం 24 పేజీల తీర్పును వెలువరించారు. 

క్విడ్‌ ప్రో కో పై ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు..
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అలాగే క్విడ్‌ ప్రో కో కూడా జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. లింగమనేని రమేష్, హెరిటేజ్‌ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్‌ సంస్థలకు లబ్ధిచేకూర్చారని  ఆరోపించింది.

ఈ లబ్ధికి ప్రతిఫలంగా కరకట్ట వద్ద ఉన్న ఇంటిని లింగమనేని రమేష్‌ చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇక ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ప్రమోద్‌కుమార్‌ దూబే, సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)