Breaking News

అన్న క్యాంటీన్లకు పసుపు రంగు.. సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

Published on Sat, 09/21/2024 - 20:38

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల భవనాలకు తెలుగుదేశం పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్‌ వేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తున్నా కానీ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు టీడీపీకి సంబంధించిన పసుపు రంగును వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందటానికి ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు వేస్తున్నారన్నారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారని.. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని పిటిషన్‌లో చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు, అన్న క్యాంటీన్ల పేరుతో పెద్ద స్కామ్‌ జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అన్న క్యాంటీన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్న క్యాంటీన్లను పైసా వసూల్ క్యాంటీన్లుగా చంద్రబాబు మార్చేశారు. అన్న క్యాంటీన్లను ప్రభుత్వమే నిర్వహిస్తుందంటూ డబ్బా కొట్టిన చంద్రబాబు.. వాటికి టీడీపీ రంగులు వేసి ఆర్భాటం చేశారు. కానీ.. ఇప్పుడు ప్రజల నుంచి చందాలు సేకరణ అంటూ మాట్లాడుతున్నారు.

ఇదీ చదవండి: తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్‌ లింకులు!?.. 

 

 

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)