Breaking News

నోటీసులు అందుకున్న వారికి వచ్చే నెలలో పింఛన్లు రావు

Published on Sat, 08/23/2025 - 03:21

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో అనర్హత నోటీసులందుకున్న దివ్యాంగులకు వచ్చేనెలలో పింఛన్లు అందవని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. రీ అసెస్‌మెంట్‌లో వైద్య పరీక్షలు పూర్తయి మళ్లీ సర్టిఫికెట్లు వచ్చాకే వారికి తిరిగి పింఛన్లు వస్తాయని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులకు అనర్హుల పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ సంఖ్యలో నోటీసులు జారీచేస్తుండడంపై వివాదం రగులుతున్న నేపథ్యంలో.. శుక్రవారం ఆయన రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 2.07 లక్షల మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని.. అంతకుముందు 15 ఏళ్లలో ఆరు లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఉన్నాయని చెప్పారు. 

అయితే, గత ఏడాది తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై అధ్యయనం చేస్తే చాలామంది అనర్హులకు వికలాంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తేలిందని.. దీంతో మొత్తం అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాలని ఆదే­శించామన్నారు. ఇక ప్రస్తుతమున్న మొత్తం 7.95 లక్షల మంది దివ్యాంగుల పింఛనుదారులకుగాను 5.50 లక్షల మందికి సంబంధించిన రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిందని, అందులో 80 వేల మంది అనర్హులుగా తేలగా, వారికి నోటీసులు జారీచేసినట్లు మంత్రి తెలిపారు. 

ఇదిలా ఉంటే.. అనర్హులుగా తేలిన వారిని వారి అర్హతబట్టి ఇతర పింఛన్లకు మళ్లిస్తున్నామని.. ఇలా 20 వేల మందిని వృద్ధాప్య పింఛన్ల కిందకు మార్చి­నట్లు మంత్రి చెప్పారు. వితంతువులు ఉంటే వాళ్లను వితంత పింఛన్లకు మారుస్తున్నామన్నారు. ఇక 2024 జులైలో 65.18 లక్షలు మందికి పింఛన్లు ఇచ్చామని.. ఇప్పుడు 63.71 లక్షల మందికి ఇస్తున్నామని.. ఈ తగ్గిన పింఛన్లు మరణించిన వారివి మాత్ర­మే­నని మంత్రి శ్రీనివాస్‌ చెప్పారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)