వలంటీర్‌ మానవత్వం..

Published on Sun, 02/04/2024 - 04:59

రొంపిచర్ల: ప్రతి లబ్ది దారుని ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాన్ని నిండు గర్భిణితో ఉన్న మహిళా వలంటీరు నెరవేర్చింది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల క్లస్టర్‌లో మేకతోటి జయంతి వలంటీర్‌గా పనిచేస్తుంది. రెండేళ్ల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చిన జయంతి.. మరోసారి గర్భం దాల్చి నవమాసాలతో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు నేడో రేపో అనే దశలో ఉంది. తన పరిధిలో నివాసం ఉండే మానసిక వికలాంగుడు సోర ప్రసన్న గత రెండు నెలలుగా తెనాలి సమీపంలోని ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

గత నెలలో అతను ఫించన్‌ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకుంటే, తనకు సీజేరియన్‌ ద్వారా ప్రసవం జరిగితే వచ్చే నెల కూడా అతనికి అందజేయగలనో లేదోననే సంచయం ఆమెను వెంటాడింది. వరుసగా మూడు నెలలపాటు పింఛన్‌ తీసుకోకుంటే లబ్ధిదారునికి పింఛన్‌ ఫ్రీజ్‌ అయ్యే అవకాశం ఉంది. తొమ్మిదో నెల గర్భిణి అయిన జయంతి.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకటో తేదీనే వెంటనే తన కుటుంబ సభ్యులను ఒప్పించి భర్త సాగర్‌ సాయంతో బైక్‌పై రొంపిచర్ల నుంచి ఎరుకలపాలెం వెళ్లింది.

అక్కడ జయంతిని చూడగానే.. అక్కా.. అక్కా అంటూ ప్రసన్న వడివడిగా పైకి లేచాడు. వేలిముద్ర వేసి రూ.3,000 తీసుకుని ఆనందంతో మా వలంటీర్‌ అక్క చాలా మంచిది.. అంటూ లోపలికి వెళ్లాడు. అప్పటి వరకు 102 కిలోమీటర్ల దూరం బైక్‌పై వస్తుంటే.. పొత్తి కడుపులో అప్పుడప్పుడూ పుట్టిన నొప్పి సోరన్న చిరునవ్వును చూడగానే మాయమైంది. అదే వాహనంపై తిరిగి 102 కిలోమీటర్ల ప్రయాణించి వచ్చింది. మరుసటి రోజు(ఫిబ్రవరి 2న ) గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సీజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)