Breaking News

‘ఏడాది తిరిగినా రాని పెన్షన్‌.. నెల రోజులకే వచ్చింది’

Published on Tue, 01/03/2023 - 13:03

సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌ రూ.2750కు పెంచి పంపిణీ చేస్తోంది. దీంతో గత మూడ్రోజులుగా కోలాహలంగా పెన్షన్‌ వారోత్సవాలు జరుగుతున్నాయి. పెన్షన్‌ వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులతో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా వితంతు పింఛన్‌ అందుకుంటున్న రాజమండ్రిలోని మున్సిపల్‌ కాలనీకి చెందిన కోటా సామ్రాజ్యం అనే మహిళ మాట్లాడారు. తనకు ఈ ప్రభుత్వం నుంచి అందిన పథకాలను గుర్తు చేసుకుంటూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

‘గత ప్రభుత్వం హయాంలో నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో రోడ్డుమీద పడ్డ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదు. రోజూ వెళ్లి చెట్లకింద కూర్చుని పెన్షన్‌ దరఖాస్తు చేశాను. ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి మేమే మానుకున్నాం. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందే.. వాలంటీరు నేరుగా మా ఇంటికే వచ్చారు. వితంతు పెన్షన్‌కు నేను దరఖాస్తు చేసుకున్నాను. ఏడాదిన్నర తిరిగితే రాని పెన్షన్‌ ఒక్క నెలకే వచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు వచ్చి మా చేతిలే పెన్షన్‌ డబ్బులు పెడుతుంటే పండగలాగా అనిపిస్తోంది.’అంటూ తన కుటుంబం లబ్ధిపొందిన వివరాలను చెబుతూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు సామ్రాజ్యం. 

వేదికపై మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌పై ఓ పాట పాడారు కోటా సామ్రాజ్యం. తన ఇంట్లో ఎప్పుడూ సీఎంను తలుచుకుంటూ ఓ పాట పాడుకుంటానని చెప్పారు. ‘దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే..నా అన్నలా ఉంటాడని అంటాను నేను.’అని పాట అందుకున్నారు. సీఎం జగన్‌ అంటే తమకు దేవుడని, జై జగనన్న, జైజై జగనన్న అంటూ ముగించారు. 

ఇదీ చదవండి: అమితానందం..పండుగలా ఫించన్ల పంపిణీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)