Breaking News

ఫొటోలు ఇవ్వని స్టూడియో యజమానికి జరిమానా

Published on Sat, 09/07/2024 - 09:04

అనంతపురం: పెళ్లి సమయంలో తీసిన ఫొటోలు, వీడియో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన స్టూడియో యజమానికి రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్‌పర్సన్‌ ఎం.శ్రీలత శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... అనంతపురానికి చెందిన శ్రీనివాసకుమార్‌ గత ఏడాది తన కుమారుడి వివాహ వేడుకకు సంబంధించి ఫొటోలు, వీడియో తీసేందుకు ఫొట్రోగాఫర్‌ జయచంద్రతో రూ.85 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో రూ.75 వేలను చెల్లించాడు.

 అయితే పెళ్లి ముగిసి నెలలు గడుస్తున్నా ఫొటోలు, వీడియో ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో శ్రీనివాసకుమార్‌ నిలదీశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియో ఇవ్వడానికి కుదరదని, కావాలంటే డబ్బు తిరిగి ఇస్తానని జయచంద్ర తెలిపి, ఆ మొత్తం కూడా ఇవ్వకుండా మొండికేశాడు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. జయచంద్ర తీసుకున్న రూ.75 వేలను 24 శాతం వడ్డీతో సహా చెల్లించాలని, మానసిక వేదనకు గురి చేయడంతో పాటు సేవాలోపానికి గాను మరో లక్ష రూపాయల జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించాలని పిటీషన్‌ దాఖలు చేశాడు. 

దీనికి సంబంధించిన నోటీసులు అందుకున్న స్టూడియో యజమాని కమిషన్‌ ఎదుట హాజరు కాకుండా ముఖం చాటేశాడు. దీనిపై పూర్వపరాలు విచారించిన అనంతరం ఫిర్యాది పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ.75వేలను 9శాతం వడ్డీతో సహా చెల్లిచండంతో పాటు మానసిన వేదనకు గురిచేయడం, సేవాలోపానికి గాను రూ.50 వేలు జరిమానా, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు అంతా కలిపి 45 రోజుల్లోపు చెల్లించాలని జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్‌పర్సన్‌ ఎం శ్రీలత, సభ్యులు డి. గ్రేస్‌ మేరి, బి. గోపీనాథ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది.  

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)