Breaking News

మోసానికి మారుపేరు చంద్రబాబు: పెద్దిరెడ్డి

Published on Thu, 01/30/2025 - 14:38

సాక్షి,వైఎస్సార్‌ జిల్లా : రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్మును ఏం చేశారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గురువారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్ అన్నారు...ఇప్పుడు సాధ్యం కాదు అంటున్నారు. ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చాను అన్నారు. ఇప్పుడేమో సూపర్‌ సిక్స్‌ గురించి మాట్లడడం లేదు. హామీ ఇచ్చే రోజు మీకు తెలియదా? వైఎస్‌ జగన్‌ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు.. చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హులు.  

ప్రజల మనోభావాలపై రాళ్ళు వేశారు. ఏడు నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ సొమ్ము ఏ సంక్షేమానికి ఇచ్చారు..? దుర్మార్గంగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. వైఎస్‌ జగన్ కోవిడ్‌-19 సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. హామీ ఇచ్చిన తేదీ ప్రకారం సంక్షేమాన్ని అందించారు. ఆ సంక్షేమం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నేతలు, అధికారులు ఏపీకి వచ్చారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారు.  

అబద్ధం చెప్పి అధికారంలోకి రావడం చాలా దుర్మార్గం: Peddireddy

కానీ చంద్రబాబు అలా కాదు. సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉన్నా.. డబ్బులు లేవని దాట వేస్తున్నారు. అంటే చంద్రబాబుకు ప్రజలకు మంచి చేసే ఉద్దేశ్యం లేదు. అధికారంలోకి వచ్చారు. ఆరోగ్య శ్రీతో పాటు, రాష్ట్రంలోని వైద్య విద్యను నిర్విర్యం చేశారు.  

మాట్లాడితే జగన్ విధ్వంసం చేశారని అంటున్నారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా.. అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడం విధ్వంసమా..?సూపర్ సిక్స్ లేదు. గుండు సున్నా చేశారు. ఆ రోజు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఆనాడు చంద్రబాబుకి వంత పాడారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)