సర్కారు నిర్ణయంతో పవన్‌ క్వాష్‌ ఉపసంహరణ

Published on Mon, 10/21/2024 - 05:17

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హ­యాంలో టీడీపీ, జనసేన నేతలపై కో­ర్టు­ల్లో దాఖలైన పరువు నష్టం కేసులన్నింటినీ ఉపసంహరించేందుకు కూట­మి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, గుంటూరు కోర్టులో తనపై దాఖలై­న పరువు నష్టం కేసును కొట్టేయాలని కోరుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హైకోర్టులో దా­ఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పట్లో వలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని పవన్‌ క్వాష్‌ పిటిషన్‌ దా­ఖలు చేశారు.

చట్ట ప్రకారం ప్రత్యా­మ్నా­య మార్గాలను చూసుకునేందుకు వీ­లు­­గా ఈ వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతివ్వాలని కోరుతూ శనివారం ప­వన్‌ తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో విచారణ జరపాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తమ క్వాష్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతివ్వాలని పవన్‌ తరఫున సీనియర్‌ న్యా­యవాది పోసాని వెంకటేశ్వర్లు కో­రారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు.

కా­గా, గతేడా­ది ఏలూరులో పవన్‌ మాట్లా­డుతూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఆడ పిల్లలు కనిపించకుండా పోతున్నారని, దీని వెనుక వలంటీర్లు ఉన్నారంటూ అనుచిత వ్యా­ఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య­లు ప్రభుత్వ పరువు, ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, పవన్‌పై సంబంధిత కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేయా­లని గుంటూరు కోర్టు పీపీని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పీపీ గుంటూరు కోర్టులో పవన్‌పై  క్రిమినల్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)