Breaking News

నేను పీకే తాలుకా.. తలచుకుంటే లేపేస్తా...!

Published on Sat, 05/10/2025 - 07:36

డాబాగార్డెన్స్‌(విశాఖపట్నం): నేను పవన్‌ కల్యాణ్‌ తాలూకా? నీవెవ్వడివిరా? నేను తలచుకుంటే లేపేస్తా.’ అంటూ ఓ వైద్యుడిపై పీకే అభిమాని విరుచుకుపడ్డాడు. ఆ వైద్యుడు కన్నీటితో తన ఆవేదనను సాక్షి వద్ద వెలిబుచ్చాడు. ఏం జరిగిందో ఆయన మాటల్లోనే..పాతనగరం ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద హోమియో క్లినిక్‌ నడుపుతున్నా. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో క్లినిక్‌ మూసి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అభాగ్యురాలు తన చంటి పిల్లలతో మండుటెండలో ఆకలితో అలమటిస్తుంటే.. బిస్కెట్స్, కూల్‌ డ్రింక్స్‌ ఇచ్చాను. 

ఆనందంగా స్వీకరించిన పిల్లలు సమీపంలోని మరిడిమాంబ ఆలయం షెల్టర్‌ వద్దకు తినుకుంటూ వెళ్లడంతో ఓ ద్విచక్రవాహనదారుడు స్పీడ్‌గా వచ్చి సడన్‌ బ్రేక్‌ వేశాడు. ‘ఎందుకు అంత స్పీడ్‌? ఇది వీధి కదా.. కొంచెం నెమ్మదిగా వెళ్లొచ్చు కదా.. అని ప్రశ్నించా..అంతే ఆ యువకుడు రెచ్చిపోయి.. ‘నేను పవన్‌ కల్యాణ్‌ తాలూకా.. నీవెవ్వడివిరా నన్ను ప్రశ్నస్తున్నావ్‌? నేను తలచుకుంటే లేపేస్తా’ అంటూ దౌర్జన్యం చేశాడని డాక్టర్‌ రియాజ్‌ అహ్మద్‌  ఆవేదన వ్యక్తం చేశాడు. 

స్పీడ్‌ బ్రేకర్లు వేసుంటే సమస్యే ఉండేది కాదు.. 
ఈ ప్రాంతంలో ఓ వైపు మరిడిమాంబ ఆలయం.. కొంత దూరంలో యాసీన్‌ బాబా దర్గా ఉన్నాయి. ఇటు మరిడిమాంబ ఆలయానికి వెళ్లే భక్తులు, యాసీన్‌ బాబా దర్గాకు వచ్చే ముస్లింలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇటు గుండానే వెళ్తుంటారు. ద్విచక్ర వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్తున్న నేపథ్యంలో స్పీడ్‌ బ్రేకర్లు వేయాలని జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డాక్టర్‌ రియాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.  

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)