ఈ భోజనం తినేదెలా?

Published on Fri, 09/13/2024 - 05:51

అఎస్‌.రాయవరం: అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయ­వరం మండలం బంగారమ్మపాలెం యూపీ స్కూల్లో మధ్యాహ్న భోజనం అత్యంత దారుణంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం వండాల్సిన సాంబారు కిచిడీని మాడ్చేసి వడ్డించడంతో విద్యార్థులు దాన్ని తినలేక పారబోశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వడ్డించిన భోజనాన్ని పరిశీలించారు. ఆరోగ్యంగా ఎదగాల్సిన పిల్లలకు ఇంత దారుణమైన భోజనం పెడతారా? దీన్ని తినేదెలా? అని మండిపడ్డారు. 

పేరెంట్స్‌ కమిటీ సమావేశం రోజే.. 
ఇక గురువారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు భోజనం తినేసరికి మాడు వాసన రావడంతో పడేసి ఆందోళనకు దిగారు. అదే సమయంలో పేరెంట్స్‌ కమిటీ సమావేశం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందుబాటులో ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను, ఉపాధ్యాయులను నిలదీశారు. 

తరచూ భోజనం నాసిరకంగా పెడుతున్నట్లు వి­ద్యార్థులు చెబుతున్నారని ఆరోపించారు. పేరెంట్స్‌ సమావేశం ఉన్నప్పుడే ఇంత దారుణంగా ఉం­టే సాధారణ రోజుల్లో ఇంకెలా ఉంటుందో తెలుస్తోందన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు సంతోష్‌ స్పందిస్తూ.. విద్యార్థులకు మంచిగా ఆహా­రం మళ్లీ వండిపెట్టాలని నిర్వాహకులను ఆదేశించారు. 

తమకిచ్చే గుడ్లు కూడా బాగోలేవని విద్యార్థులు చెప్పగా, ప్రభుత్వం అలాంటి గుడ్లనే సరఫరా చేస్తున్నపుడు, తామేం చేయగలమని తల్లిదండ్రులతో హెచ్‌ఎం చెప్పారు. ఇక పాఠశాలలో వసతులూ బాగోలేవని, మైదానం దారుణంగా తయారైందని, ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటని ప్రశి్నంచారు. చివరికి.. నిర్వాహకులు మ­ళ్లీ భోజనం వండి పెట్టడంతో ఆందోళన ముగిసింది. 

అనకాపల్లి జిల్లాలో విద్యార్థుల ఆందోళన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)