Breaking News

కూటమి నేతల దాష్టీకం

Published on Mon, 06/02/2025 - 02:39

సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడన్న అక్కసుతో ఓ రైతుకు చెందిన బొప్పాయి తోటను కూటమి నేతలు ధ్వంసం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో జరిగింది. బాధిత రైతు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కల్లూరి చంద్రమౌళి కుటుంబం మొత్తం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ నేతలు, గ్రామంలోని ఎస్సీలను రెచ్చగొట్టి వారిచేత చంద్రమౌళి, అతని బంధువులకు చెందిన 4.40 ఎకరాల పట్టా భూమిని స్వాదీనం చేసుకున్నారు. 

అప్పటికే ఆ పట్టా భూమి వ్యవహారంపై కందుకూరు కోర్టులో చంద్రమౌళికి అనుకూలంగా స్టే ఆర్డరు ఉంది. అయినా దానిని ఆక్ర­మించి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఆక్రమణ విషయమై కలెక్టర్‌కు అర్జీ ఇవ్వడంతో సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అప్పటికే ఆ భూమిలో జేసీబీలతో గుంతలు తీయించి ఆక్రమణదారులు చిన్న గృహాల్లా కట్టుకుని అందులో బెల్టుషాపు నిర్వహిస్తున్నారు. బెల్ట్‌షాపు నిర్వాహకుడిని ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకోవడంతో అది చంద్రమౌళే పట్టించాడని నిర్వాహకుడు నానా హంగామా చేశాడు.

ఈక్రమంలో అధికారులు ఆక్రమిత భూమిలోని ఇళ్లను ఖాళీ చేయించారు. దీనిపై కక్ష పెంచుకున్న టీడీపీ వర్గీయులు సర్వే నంబర్‌ 49–1బీలో చంద్రమౌళి సాగు చేసిన బొప్పాయి తోటను శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)