Breaking News

నకిలీ కార్ల ముఠా అరెస్ట్‌

Published on Tue, 12/23/2025 - 05:21

నరసరావుపేట రూరల్‌: నకిలీ కార్ల ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి 20 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. సోమవారం నరసరావుపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకరులకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 12న విజయవాడకు చెందిన పుల్లా శ్రీనివాసరెడ్డి తన కారును నకరికల్లుకు చెందిన పుల్లంశెట్టి అంజినాయుడు వద్ద తాకట్టు పెట్టగా, అసలు, వడ్డీ చెల్లించినా కారు తిరిగి ఇవ్వకుండా నంబర్‌ ప్లేట్‌ను మార్చి తిరుగుతున్నట్లు నరసరావుపేట రూరల్‌ స్టేçషన్‌లో ఫిర్యాదు అందిందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంజినాయుడు ఇచ్చిన సమాచారంతో నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన పుల్లంశెట్టి భానుప్రకాష్ , గురజాలకు చెందిన షేక్‌ మహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌కు చెందిన మధ్యాహ్నపు మోహన సత్యశ్రీనివాస్‌లు రావిపాడు రోడ్డు చెక్‌పోస్ట్‌ వద్ద 3 కార్లు తీసుకుని విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

విచారణలో 3 కార్లకు ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో వాటిని సీజ్‌ చేశామన్నారు. నిందితులను విచారించగా.. ఫైనాన్స్‌ సంస్థలకు బకాయిలు ఎగ్గొట్టేందుకు నంబర్‌ ప్లేట్లు మార్చినట్లు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. ఈ విధంగా తాకట్టు పెట్టుకునే క్రమంలో ఒక ముఠాగా ఏర్పడి పలు ఫైనాన్స్‌ సంస్థల నుంచి 20 కార్లను తీసుకున్నట్లు తెలిపారు. ఆయా కార్లకు నెలవారి కిస్తీలు చెల్లించకుండా నంబర్‌ ప్లేట్లు మార్చి అద్దెకు తిప్పుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో పాటు కొందరు యజమానుల నుంచి కార్లను తాకట్టు రూపంలో తీసుకుని అసలు, వడ్డీ చెల్లించినా కార్లు తిరిగి ఇవ్వకుండా బెదిరించి బలవంతపు అగ్రిమెంట్లు తీసుకున్నారన్నారు. ఆ విధంగా 20 కార్లను తీసుకుని కొన్నిటికి నంబర్లు మార్చి, మరికొన్నిటికి ఫైనాన్స్‌ ఎగొట్టారని తెలిపారు. ఒక వాహనానికి రిజి్రస్టేషన్‌ నంబర్‌ను మరొక వాహనానికి మార్చారని చెప్పారు.  

వెలుగులోకి వచ్చిందిలా.. 
చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థుల మృతి కేసులో నిందితులు వినియోగించిన కారుపై విచారణ జరపడంతో నకిలీ కార్ల వినియోగం వెలుగు చూసింది. నకిలీ కార్ల కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేయగా మరో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. నకరికల్లు గ్రామానికి చెందిన పొనుగంటి రామకృష్ణ అలియాస్‌ ఆర్‌కే, హైద్రాబాద్‌కు చెందిన భానుప్రకాష్ గౌడ్, వైజాగ్‌కు చెందిన వర్మ, నరసరావుపేటకు చెందిన ఏఎస్‌ఐ కుమారుడు మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు, పుల్లంశెట్టి మహేష్ బాబులను అరెస్ట్‌ చేయాల్సి ఉందన్నారు. నిందితులకు కార్లకు సంబందించిన నకిలీ డాక్యుమెంట్లు అందించడంలో ప్రకాష్ ­గౌడ్, సత్యశ్రీనివాస్, వర్మలు సహకరించారని తెలి­పారు. ఇద్దరు పోలీసు అధికారులు కూడా గతంలో నిందితుల నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్టు విచారణలో తెలిసిందన్నారు. ఆ వాహనాలను అప్పుడే సదరు ఫైనాన్స్‌ సంస్థకు అప్పగించినట్టు తెలిపారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)